హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 దేశాల్లో 40 వేల మందితో సర్వే : ఎనిమిదో స్థానంలో శంషాబాద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎయిర్ పోర్టు ఆన్ టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎయిర్ హెల్ప్ ప్రపంచంలోని విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే చేపట్టి జాబితా రూపొందించింది. 2019 సంవత్సరానికి ర్యాంకింగ్స్ విడుదల చేయగా .. అందులో మన భాగ్యనగరానికి చెందిన శంషాబాద్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

హమద్ కు ఫస్ట్ ప్లేస్

హమద్ కు ఫస్ట్ ప్లేస్

ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ పోర్టు ఖతార్ లోని హమద్ ఇంటర్నేషనల్ చోటు దక్కించుకుంది. తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో రెండు, మూడోస్థానాల్లో నిలిచాయి. అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోవడం విశేషం.

టాప్-3లో ఇవే ...

టాప్-3లో ఇవే ...

2015 నుంచి ఎయిర్‌హెల్స్‌ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి హమద్‌, టోక్యో, ఏథెన్స్‌ విమానాశ్రయాల్లో వరుసగా టాప్‌ 3లో ఉంటున్నాయి. వీటితో పాటు ఎయిర్‌లైన్లకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ , ఏరోమెక్సికో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.

టాప్ -10లోని ఎయిర్ పోర్టులు

టాప్ -10లోని ఎయిర్ పోర్టులు

బ్రెజిల్ లోని అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం, పోలాండ్ లోని గాన్స్‌ లెచ్‌ వలేసా ఎయిర్‌పోర్టు, రష్యాలోని షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం, సింగపూర్ లోని షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్‌ వరుసగా 4,5,6,7 స్థానాల్లో నిలిచాయి. స్పెయిన్ లోని టెనెరిఫె నార్త్‌ ఎయిర్‌పోర్టు, బ్రెజిల్ లోని విరాకోపస్‌/కాంపినస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 9, 10 స్థానాల్లో నిలిచాయి.

English summary
Air Help ranked the world's airports by taking into consideration airfare on time management, quality of services, food and shopping. The survey carried out a list of 40,000 passengers in 40 countries. The rankings were released in 2019, whereas Shamshabad is ranked eighth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X