• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొలిక్కిరాని టీ పీసీసీ చీఫ్ ఎంపిక: రేసులో ఇద్దరే, అద్భుతం జరిగితే ఆయన...?

|

టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. రేపు, మాపు అని ప్రతీ రోజు ప్రకటన వస్తోంది. కానీ అనౌన్స్‌మెంట్ మాత్రం ఉండటం లేదు. ఈ మధ్య సాయంత్రం వరకు ప్రకటన ఉంటుంది అని హడావిడి చేశారు. కానీ మళ్లీ తుస్సు మనిపించారు. ఇంతకీ పీసీసీ చీఫ్ పదవీ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది..? పోటీ ఎక్కువగా ఉండటమేనా..? లేదంటే హై కమాండ్ కావాలనే నాన్చుడు ధోరణి అవలంభిస్తోందా..? అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.

గ్రేటర్ ఫలితాల తర్వాత నుంచి..

గ్రేటర్ ఫలితాల తర్వాత నుంచి..

అప్పుడెప్పుడో గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకి రాజీనామా చేశారు. కొత్త నేతను మాత్రం ఎంపిక చేయడం లేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అన్నారు.. అక్కడ కూడా కారు టాప్ స్పీడులో దూసుకెళ్లింది. దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడుతూనే ఉంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. కానీ ప్రకటన మాత్రం రాలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే కారణం అని అనుకోవచ్చెమో.

రేవంత్ పేరే..? కానీ

రేవంత్ పేరే..? కానీ

వాస్తవానికి రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చేందుకు హస్తిన పెద్దలు ఇంట్రెస్ట్‌గా ఉన్నారని సమాచారం. కానీ రాష్ట్రంలో ఓ వర్గం రేవంత్‌కు పదవీ ఇవ్వొద్దు మొర్రొ అని విజ్ఞప్తి చేశారట. దీంతో అధిష్టానం కూడా పునరాలోచనల పడిందని సమాచారం. లేదంటే ఎప్పుడో ప్రకటన వచ్చేదని అంటున్నారు. రేవంత్‌ను కోమటిరెడ్డి అండ్ కో వ్యతిరేకిస్తున్నారు. వీహెచ్ లాంటి సీనియర్ నేత బాహాటంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందుకే రేవంత్‌ పేరును ప్రకటించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇంచార్జీ ఠాగూర్ మాత్రం 150 మంది అభిప్రాయం తీసుకొని.. అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక సమర్పించారు. ఇద్దరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ఉండే అవకాశం ఉంది.

జీవన్ రెడ్డి పేరు..

జీవన్ రెడ్డి పేరు..

అంతకుముందు సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అదీ ప్రచారంగానే మిగిలిపోయింది. జీవన్‌కు పీసీసీ చీఫ్ ఇచ్చి.. వెనకాల రేవంత్ చక్రం తిప్పేలా వ్యుహరచన చేశారు. మాజీమంత్రి శ్రీధర్ బాబు పేరు కూడా వినిపించింది. ఆయనకు కన్ఫామ్ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన పేరు తెరమరుగు అయ్యింది. ఇదివరకు రెడ్డీలకే పదవీ ఇచ్చినందున.. ఇప్పుడు బీసీలకు ఇస్తారనే లీకుల వచ్చాయి. అలా అనడంతో బీసీ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేశారు.

తెరపైకి మధుయాష్కీ పేరు

తెరపైకి మధుయాష్కీ పేరు

బీసీల్లో ముందువరసలో ఉంది మధుయాష్కీ గౌడ్. పీసీసీ చీఫ్ పదవీ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇలా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. బీసీలకు అయితే తనకే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ హై కమాండ్ మాత్రం.. బలమైన నేతకు ఇవ్వాలని అనుకుంటుందని సమాచారం. అలా అయితే రేవంత్ లేదా కోమటిరెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియదు. అద్భుతం జరిగితే తప్ప మధుయాష్కీ, శ్రీధర్ బాబు లాంటి నేతలకు పదవీ దక్కే ఛాన్స్ ఉంది.

English summary
tpcc chief election process to be suspense till now. revanth reddy, komatireddy venkatreddy, madhu yaski goud are front runners
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X