హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ పీసీసీ చీఫ్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయకపోవడమేనని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సహా.. దుబ్బాక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక గ్రేటర్‌లో అయితే చతికిలబడిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటా బయట విమర్శలు వస్తున్నాయి. ఉత్తమ్ రాజీనామా చేయగా.. కొత్త నేత ఎంపికలో హైకమాండ్ నిమగ్నమైంది. ఒకరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు


ఉత్తమ్ రాజీనామా తర్వాత ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. అయితే హైకమాండ్ మాత్రం వెంకట్ రెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో ఆయన కీల‌క పాత్ర పోషించారు. దీంతోపాటు తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మునిసిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో వెంకట్ రెడ్డి వైపు హై కమాండ్ సానుకూలంగా ఉంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

ప్రభావం చూపని రేవంత్, శ్రీధర్ బాబు

ప్రభావం చూపని రేవంత్, శ్రీధర్ బాబు

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను ఉత్తమ్‌తోపాటు రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ అంతగా ప్రభావం చూపలేకపోయారు. తమ నియోజక వర్గాల్లో పార్టీ నేతలను గెలిపించుకోలేకపోయారు. దీంతో రేవంత్, శ్రీధర్ బాబుపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం సుముఖంగా లేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించే నేత కోసం అన్వేషించారు. వారికి వెంకట్ రెడ్డి మాత్రమే కనిపించారు.

ఉత్తమ్ బాటలో రేవంత్

ఉత్తమ్ బాటలో రేవంత్

జీహెచ్ఎంసీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా అదే బాట‌లో రేవంత్ రెడ్డి పయనించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వీకి సాయంత్రం రాజీనామా స‌మ‌ర్పిస్తారని సమాచారం.‌ పీసీసీ చీఫ్‌తోపాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గురుని ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. ఆ ముగ్గురు ఎవరనే అంశంపై క్లారిటీ లేదు. కానీ వారు వెంకట్ రెడ్డి వర్గీయులు అయి ఉంటారని మాత్రం టాక్ నడుస్తోంది.

English summary
tpcc president will be komatireddy venkat reddy, congress high command soon announe his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X