హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ వాహనాలపై స్టిక్కర్లు అతికించారా?.. ఇకపై చలానా కట్టాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వాహనాలపై పోలీస్, ప్రెస్, డిఫెన్స్ అంటూ స్టిక్కర్లు అతికించుకుని హైదరాబాద్ రోడ్లపై దర్జాగా దూసుకెళుతున్నారా? ఇన్నాళ్లు మీ వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లున్నా అభ్యంతరం వ్యక్తం చేయని పోలీసులు.. ఇప్పుడు మాత్రం ఏకంగా చలాన్లు వేసే ఛాన్సుంది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే వందల మంది అసలు సిసలు కాని పోలీసులు, విలేఖరులు అడ్డంగా దొరికిపోయారు. ఇన్నాళ్లు వార్నింగ్ లతో సరిపెట్టిన పోలీసులు ఇకపై చలాన్లు వేయడానికి సిద్ధమయ్యారు.

<strong>పాకిస్తాన్ రిపోర్టర్లా, మజాకా?.. ఆనాడు గాడిద.. ఈనాడు వరద (వీడియో)</strong>పాకిస్తాన్ రిపోర్టర్లా, మజాకా?.. ఆనాడు గాడిద.. ఈనాడు వరద (వీడియో)

రూల్స్ బ్రేక్

ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్లు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ చాలామంది వాహనదారులు ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్లను తమకు ఇష్టమొచ్చినట్లుగా, ఇతరులను ఆకర్షించేటట్లుగా మార్చేస్తున్నారు. ఉదాహరణకు 8055 నెంబరును BOSS లాగా మార్చేస్తున్నారు. ఇలాంటివి హైదరాబాద్ మహానగరంలో కొకొల్లలు.

 అడ్డగోలు స్టిక్కర్లు..!

అడ్డగోలు స్టిక్కర్లు..!

కొందరైతే వాహనాల నెంబర్లు కనిపించకుండా స్టికర్లు అతికిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో గానీ, ఇతరత్రా కేసులు చేధించడంలో వాహనాల నెంబర్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది వాహనాల నెంబర్లు కనబడకుండా కొందరు ఇష్టారాజ్యంగా స్టిక్కర్లు వేస్తున్నారనేది పోలీసుల ఆరోపణ.

కొందరైతే పోలీస్ డిపార్టుమెంట్, మీడియా సంస్థల్లో పనిచేయకున్నా యధేచ్ఛగా పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటుండటం గమనార్హం. రెండు మూడు నెలల కిందట నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఒక్కరోజే దాదాపు 300 మంది పట్టుబడటం గమనార్హం. అప్పుడు వారందరికీ వార్నింగ్ ఇచ్చి.. మరోసారి రిపీట్ కాదంటూ సంజాయిషీ లెటర్లు రాయించుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా చలాన్ల మోత మోగిస్తున్నారు.

 పోలీస్ స్టిక్కర్లపై స్పెషల్ డ్రైవ్

పోలీస్ స్టిక్కర్లపై స్పెషల్ డ్రైవ్

ట్రాఫిక్ పోలీసులు ఈనెల 15, 16 తేదీల్లో పోలీస్ స్టిక్కర్ అతికించిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పోలీస్ డిపార్టుమెంట్ తో సంబంధం లేని 104 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. మరో 147 వాహనాలకు సంబంధించి స్టిక్కర్లు రిమూవ్ చేయించారు. ఇకముందు కూడా చర్యలు కొనసాగుతాయని.. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై కొరడా ఝలిపిస్తామంటున్నారు అధికారులు.

ఇకపై వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు కనిపించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రెస్, పోలీస్, డిఫెన్స్, డాక్టర్, అడ్వకేట్.. ఇలా ఏ స్టిక్కర్ కూడా అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాలపై స్టిక్కర్లతో దొరుకుతున్నవారు ఎవరైనా సరే వదలడం లేదు. చలానా వేస్తూనే ఉన్నారు.

కీపిటప్.. శభాష్

కీపిటప్.. శభాష్

ట్రాఫిక్ పోలీసుల తీరుకు నెటిజన్ల నుంచి వీపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా చాలామంది కితాబిస్తున్నారు. వాహనాలపై స్టిక్కర్లు అతికించినవారిపై చర్యలు తీసుకోవడం భేషంటూ పొగుడుతున్నారు కొందరు. మరికొందరేమో రూల్స్ బ్రేక్ చేసిన వాహనాలకు సంబంధించిన ఫోటోలు పెడుతూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
Hyderabad Traffic Police is conducting a special drive against the vehicles which are using stickers on their vehicles. If such any vehicles with stickering caught by police, the motorists penalized with challan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X