• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భారీ వర్షాల ఎఫెక్ట్ ... హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్ళింపులు .. ఎక్కడెక్కడ అంటే

|

వర్ష బీభత్సంతో గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మరోవైపు మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. హైదరాబాద్లోనూ ప్రధాన రహదారుల మీద వరద ఉధృతి కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు.

జాతీయ రహదారులపై వరద ప్రభావం .. హైదరాబాద్ - విజయవాడ హైవే తోపాటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్

నగరంలో ట్రాఫిక్ మళ్ళింపులు ఇవే

నగరంలో ట్రాఫిక్ మళ్ళింపులు ఇవే

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాహనాలు ఓ ఆర్ ఆర్ మీదుగా వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు. మెహదీపట్నం నుండి గచ్చిబౌలి వెళ్లే వాళ్ళు టోలిచౌకి ఫ్లైఓవర్ ను వాడవద్దని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సెవెన్ టూంబ్స్ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు మూసివేస్తున్నట్లు గా పేర్కొన్నారు. అక్కడినుండి వాహనాలను కార్వాన్ మీదుగా మళ్లిస్తున్నారు. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ స్తంభించింది.

మలక్ పేట , ఎల్బీనగర్ , చాదర్ ఘాట్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

మలక్ పేట , ఎల్బీనగర్ , చాదర్ ఘాట్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

మలక్ పేట ఎల్బీనగర్ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటుగామూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తోంది. చాదర్‌ఘాట్‌ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ కాలనీలుపూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు డాబాలపైకి చేరారు. చాదర్‌ఘాట్‌ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఈ ప్రాంతం నుండి వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

హైదరాబాద్ నుండి తుప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ కు దారి మళ్లింపు

హైదరాబాద్ నుండి తుప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ కు దారి మళ్లింపు

హైదరాబాద్ నుండి తుప్రాన్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వారికి కూడా ట్రాఫిక్ మళ్ళించారు .మేడ్చల్ నుండి కిష్టాపూర్, ములుగు, గజ్వేల్ మీదుగా దారి మళ్ళించారు . మైలార్‌దేవ్‌పల్లి పల్లె చెరువుకు గండి పడడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి వరద ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, మున్సిపల్‌, విపత్తు నివారణా అధికారులు రంగంలోకి దిగారు .

ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై నిలిచిన ట్రాఫిక్

ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై నిలిచిన ట్రాఫిక్

అల్‌ జుబేల్‌ కాలనీ, అలీనగర్‌, గాజీ మిలన్‌ కాలనీ, నిమ్రా కాలనీ.. ఉప్పుగూడ, లలితా బాగ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉండడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోపక్క పటాన్ చెరువు లోనూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అమీన్‌పూర్ సాయి కాలనీ, ఆల్విన్ కాలనీలో భారీ వర్షాలకు ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలు పడుతుండటంతో వాహనాలను టోల్ గేట్ సిబ్బంది ఎక్కడికక్కడ నిలిపివేశారు.

English summary
In Hyderabad too, traffic diverted in several places due to the flood affect on major roads. Traffic police are giving regular updates through social media platform twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X