హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..! మధ్యాహ్నం నుండే దారి మళ్లింపు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సమరానికి పార్టీ అధినేతతో సమరశంఖం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో తీవ్ర నైరాశ్యం ఆవహించిన నేతల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో అగ్రనేతలు, కార్యకర్తల్లో నూత‌న జోష్ రావ‌డం ఖాయ‌మ‌ని పార్టీ విశ్వాసంతో ఉంది. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ చేరుకుంటారు.

ముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లుముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లు

అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు క్లాసిక్‌ కన్వెన్షన్‌ పక్కన ఉన్న మైదానంలో నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటల తరువాత సభ నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

Traffic restrictions in the city ..! Redirect from the afternoon .. !!

నేటి మధాహ్నం నుండి శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌గాంధీ సభ జరగనుంది. దీని దృష్ట్యా శంషాబాద్ మీదుగా కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ అవతల ఎన్‌హెచ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఆరాంఘర్-శంషాబాద్ మార్గంలోకి వెళ్లొద్దన్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా దారి మళ్లింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

English summary
The party is confident that a new Josh will emerge among top leaders and activists as AICC President Rahul Gandhi has come to his own in order to enhance his self-confidence in the leaders of the extreme despair. AICC president Rahul will reach Shamshabad airport at 4.30 pm on a special flight from Bangalore on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X