హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad: ఫ్రిబవరి 11న ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారా.. అయితే చుక్కలే..!

ఫ్రిబవరి 11న ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది భారత్ లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మంగా జరిగే ఫార్ములా ఇ-రేస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని FIA ప్రపంచ పాలక సంస్థ అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్​ బిన్​ సులేయంకు ఆహ్వానం పంపారు.

11 జట్లు, 22 మంది డ్రైవర్స్

11 జట్లు, 22 మంది డ్రైవర్స్


హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్ పై ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. 18 మలుపులతో ఉన్న ట్రాక్‌పై రేసింగ్ నిర్వహించనున్నరాు. ఈ రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్స్ పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఈ ఈవెంట్ కు హైదరాబాద్‌ సర్క్యూట్‌లో అడుగడుగునా భద్రతా పరంగా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా నిర్మిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు

మౌలిక సదుపాయాలు


ఇప్పటికే ఈవెంట్ జరిగే చోట మౌలిక సదుపాయాలు తాత్కాలికంగానే ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ శాశ్వత నిర్మాణం ఉండే టీమ్ గ్యారేజీలకు పనులు కొనసాగుతోన్నాయి. ఫార్ములా E అనేది 2013లో ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి FIA ప్రపంచ ఛాంపియన్‌షిప్-స్టేటస్ ఈవెంట్ గా నిలవనుంది. అయితే ఈ ఈవెంట్ కారణంగా
ట్యాంక్ బండ్ పరిసరా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్

తెలుగుతల్లి ఫ్లైఓవర్


ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
మింట్ కాంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్ వరకు వాహనాలను అలో చేయరని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఫార్ములా ఈ రేస్ ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి అధికారులతో భేటీ అయ్యారు.

నాగార్జున

నాగార్జున


ఈ ఈవెంట్ కు సంబంధించి నటుడు నాగార్జున కేటీఆర్ కు అభినందనలు తెలిపారు.తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ఈరేసుకు సంబంధించిన‌ టికెట్ల‌ను ఇప్ప‌టికే బుక్‌మైషోలో అమ్మ‌కానికి పెట్టారు.

English summary
The Telangana government is making special arrangements for the Formula E-Racing event to be held at Hussain Sagar in Hyderabad on February 11. For the first time in India, Formula E-Racing will be held at the Hyderabad venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X