హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వర్షం పడితే మీరు ఎలా వెళ్లాలో... ఇక పోలీసులు నిర్ణయిస్తారు....!

|
Google Oneindia TeluguNews

సాధరణ రోజుల్లోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా ఉంటాయి..గంటకు పది నుండి ఇరవై కిలోమీటర్ల మేర మాత్రమే వాహానాలు కదిలే పరిస్థితి ఉంటుంది. ఇక వర్షాలు కురిస్తే మాత్రం వాహానదారుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం అని చెప్పవచ్చు...వర్షం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు లేకుండా పలు ప్రాంతాల్లో డైవర్షన్ చేపట్టారు.

ట్రాఫిక్ కష్టాలకు చెక్...

ట్రాఫిక్ కష్టాలకు చెక్...

హైదరాబాద్‌లో ఇటివల కురిసిన వర్షాలతో అలర్ట్ అయిన పోలీసులు రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వర్షాకాలం కావడంతోపాటు రోడ్ల పైకి నీరు చేరి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఈనేపథ్యంలోనే వర్షం పడ్డ రోజు గంటకు 10 కిలోమీటర్లు కూడ కదలని పరిస్థితి..ఎందుకంటే రోడ్డుపై నీరు నిలవడంతోపాటు, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుని ఉంటుందో తెలియని పరిస్థితి..దీనికి తోడు కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లేందుకు ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్లమీదకు రావడంతో వేలాదిగా వాహానాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు.

యూటర్న్‌లు మూసి వేస్తున్న పోలీసులు

యూటర్న్‌లు మూసి వేస్తున్న పోలీసులు

ఈనేపథ్యంలోనే వర్షాలు పడే రోజున ఇప్పటికే యూ టర్న్‌లను మూసివేస్తున్నారు. యూటర్న్‌ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మెయిన్ రోడ్డును తాకే చిన్న చిన్న గళ్లీల ట్రాఫిక్‌ కూడ డైవర్ట్ చేస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు..వాహానాదారులు ఒకే రూటులో తమ గమ్యానికి చేరుకోవడం ద్వార మొత్తం ట్రాఫిక్ అంతా మెయిన్ రోడ్లపై నిలిచిపోతుంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్‌ను చెపట్టారు. వర్షాలు పడే రోజుతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్ల ట్రాఫిక్‌ను ఇతర రూట్లలోకి మళ్లించనున్నారు.దీంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలు ఇవే

ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలు ఇవే

ముఖ్యంగా హైటెక్ ‌సిటీతోపాటు మైండ్ స్పేస్ గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షం కారణంగా ప్రయాణికులు చాల ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు రూట్ మ్యాప్‌లను సిద్దం చేశారు.

జేఎన్టీయూ - గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ - నెహ్రూ జంక్షన్, జేఎన్టీయూ - మైండ్ స్పేస్ మధ్య రోజూ వారీ మార్గాలను కాకుండా ఇతర మార్గాలు సూచించారు. ఇందులో భాగంగానే * జేఎన్టీయూ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాళ్లు మియాపూర్, ఆల్వీన్, బెల్, గుల్మోహర్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మరోవైపు జేఎన్టీయూ నుంచి మలేషియన్ టౌన్ షిప్ మీదుగా మైండ్ స్పేస్ వెళ్లే వాళ్లు.. మియాపూర్, ఆల్వీన్ కాలనీ, హఫీజ్ పేట్, కొండాపూర్, కొత్తగూడ, సైబర్ టవర్ గుండా మైండ్ స్పేస్‌కు చేరుకోవాలని తెలిపారు.ఇక ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలీ, కొత్తగూడ మీదుగా నెహ్రూ జంక్షన్‌కు వెళ్లే వాళ్లు... గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఖాజాగూడ, విస్పర్ వ్యాలే, కేబీర్ పార్క్ మీదుగా నెహ్రూ జంక్షన్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.

English summary
Traffic has been diverted in rainy day in hyderabad,some main roads will be diverted ,be cause of rain season.root maps have been ready by the traffic police.mainly, hi tech city, gachi bouli,mind space, jntu, and many other roots will be diverted on the rainy day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X