హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో బాష పై మోసం...ఉన్నది ఉన్నట్లు చెప్పమంటే లక్షల దోపిడి..!

|
Google Oneindia TeluguNews

మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలేనని ఒక మహానాభావుడు చెప్పినట్టు అక్షరాల అదే జరుగుతుంది..మానవ సంబంధాలు నిత్యం డబ్బుతో ముడిపడి ఉంటున్నాయి. ఏపని చేసిన నాకేంటీ..అనే తత్వం మర మనషుల్లో ఎక్కువతుంది. సాయం కోరి వచ్చిన వారిపై కూడ కనికరం చూపడం లేదు. మరి కొందరైతే వారు చేసిన సాయానికి పత్రి ఫలం ఇచ్చినా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు..దీంతో ఎంత దొరికితే అంత నొక్కెయ్యాలనే చీఫ్ ఆలోచనలు మానవ సంబంధాలను మరింత కుంగదీస్తున్నాయి.

వీదేశీయుల బాషను ఆసరా చేసుకుని లక్షల మోసం

వీదేశీయుల బాషను ఆసరా చేసుకుని లక్షల మోసం

హైదరాబాద్‌ మెడికల్ హబ్ గా ఉన్న విషయం తెలిసిందే..దీనికి తోడు ఇది కాస్మోపాలిటన్ సిటి..దీంతో వేలాది మంది విదేశీయులు వస్తుంటారు. అయితే వారికి బాషపరమైన ఇబ్బందులు తలేత్తుంటాయి.. స్థానికంగా ఉన్నా వారితో మాట్లడడం చాల కష్టంగా ఉంటుంది..దీనికి తోడు విదేశీయులను చూస్తే ఒకటికి రెండు రుపాయలను చెప్పే ధోరణి వ్యాపారుల్లో ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగానే విదేశీయులు స్థానికంగా లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ట్రాన్స్‌లేటర్స్‌కు ఫీజు రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తారు...

దేశ గౌరవాన్ని మంటగలుపుతున్న కొంతమంది ట్రాన్స్‌లేటర్స్

దేశ గౌరవాన్ని మంటగలుపుతున్న కొంతమంది ట్రాన్స్‌లేటర్స్

అయితే విదేశీయులు చెల్లించే డబ్బులు కాకుండా అదనంగా కక్కుర్తి పడుతున్నారు కొంతమంది ట్రాన్సేలేటర్లు...డబ్బుకోసం కక్కుర్తిపడి దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. తమని సేవ్ చేస్తారని భావించే ట్రాన్స్‌లేటర్స్... విదేశీయుల పాలిట డబ్బుదోచుకునే ముఠాలుగా తయారయ్యారు..అయితే ఇలాంటీ ఘటనలు ఎక్కువగా ఆసుపత్రుల వద్ద చేసుకుంటున్నట్టు సమాచారం..ఇలానే ఓ ట్రాన్సేలటర్ ఆసుపత్రి బిల్లుల విషయంలో ఓ విదేశీయురాలిని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది...

మూడు లక్షలకు గాను ఏడు లక్షల రుపాయాలను నొక్కిన ట్రాన్స్‌లేటర్

మూడు లక్షలకు గాను ఏడు లక్షల రుపాయాలను నొక్కిన ట్రాన్స్‌లేటర్

మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఓ మహిళ గాల్‌బ్లాడర్ సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ అయింది. బాషా సమస్యతో ఓ ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేసుకుంది....దీంతో ఆమే ఆసుపత్రి వ్యవహారాలు చూశాడు ట్రాన్న్‌లేటర్. అయితే ఆసుపత్రి ఖర్చులు మొత్తం మూడు లక్షల రుపాయలు అయ్యాయి..ఇక ఇక్కడే చేతివాటం చూపించారు ట్రాన్స్‌లేటర్.. అసలే ఆసుపత్రి, అందులో బాష సమస్య..దీంతో తాను ఎంత తీసుకున్నా.. విచారణ చేస్తుందా అనుకున్నాడో ఏమో..మూడు లక్షల బిల్లును ఏడు లక్షలు చేశాడు..అయితే ఆసుపత్రిలో ఉన్న విదేశీయురాలు ముందుగా అడిగినంతా ఇచ్చింది..అనంతరం అసలు విషయం తెలుసుకుంది..దీంతో ట్రాన్స్‌లేటర్ మోసం బయటపడింది.. ఆమే బంజారా హిల్స్‌ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది. తనకు న్యాయం చేయాలని పిర్యాధులో పేర్కోంది..పోలీసులుకు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేస్తున్నారు.

English summary
a translator cheated a foreign patient who is admited in a private hospital for treatment for galbladar problem.he collected the amount of rs seven lakhs Instead of three lakhs for hospital bills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X