హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రిపుల్ రైడింగ్.. ట్రాఫిక్ పోలీస్‌పై దాడి.. పరుగెత్తించి కొట్టారు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ పోలీస్ మీద దాడికి కారణమైంది. ఒక్క బైకు మీద ముగ్గురు ప్రయాణిస్తూ ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేయడంతో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీయడంతో ఆ యువకులు రెచ్చిపోయారు. సదరు పోలీస్‌ను పరుగెత్తించి కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

హైదరాబాద్ లక్డీకాపూల్ ప్రాంతంలోని బజార్ ఘాట్ ఏరియాలో నిలోఫర్ కేఫ్ ఉంది. అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రూట్లో ట్రిపుల్ రైడింగ్ వెళుతున్న యువకులను ఫోటో తీశారు. దాంతో సదరు ట్రాఫిక్ పోలీసుతో గొడవకు దిగారు యువకులు. అందులో ఒకడు ఆయనపై చేయి చేసుకున్నాడు. అంతేకాదు ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించి దాడి చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేవలం తమను ఫోటో తీశారనే నెపంతో ఆయనపై దాడికి తెగబడ్డారు యువకులు.

triple riding cause to attack on traffic police in hyderabad

1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా

ట్రాఫిక్ పోలీస్‌పై దాడి జరుగుతుంటే అక్కడున్న వారు అలాగే చూస్తుండి పోయారు తప్ప ఎవరూ అడ్డుకోలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన సదరు యువకుడు కానిస్టేబుల్‌ను పరుగెత్తించి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు యువకులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు పోలీసులు.

డ్యూటీలో ఉన్న పోలీసులకు రక్షణ లేకుండా పోతోంది. పోలీసులపై దాడి చేస్తున్న ఇలాంటి ఘటనలు ఇటీవల తరచుగా వెలుగు చూస్తున్నాయి. విధి నిర్వహణలో ఒక్కరే ఉండటం.. దాడి చేసేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటుండటంతో వారు తప్పించుకోలేని పరిస్థితి. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను నిలువరించేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Triple Riding Cause to attack on Traffic Police in Hyderabad. He taken snap of triple riding, then youngsters beaten traffic constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X