హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ద‌ళితున్ని సీయం చేయ‌లేదు..! సీఎల్పీ నేత‌గా కూడా ఉండ‌నివ్వ‌రా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్ర‌తిప‌క్ష నేత అంశంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ అదికార గులాబీ పార్టీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. ఇటు పార్టీ గొంతు చ‌ట్ట స‌భ‌ల్లో బ‌లంగా వినిపిస్తూనే టీఆర్ఎస్ పార్టీకి స‌రైన కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టైంద‌ని పార్టీలో పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక ఎంత వీలైతే అంత మందిని త‌మ పార్టీలో క‌లిపేసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌నీయ‌కుండా చేద్దామ‌న్న అదికార పార్టీ గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ వేసింది కాంగ్రెస్ పార్టీ..!

కేటీఆర్ రమ్మన్నారు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ కసితో గజ్వెల్లో పోటీ చేశా: టీఆర్ఎస్‌లో చేరిన వంటేరు కేటీఆర్ రమ్మన్నారు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ కసితో గజ్వెల్లో పోటీ చేశా: టీఆర్ఎస్‌లో చేరిన వంటేరు

శాస‌న స‌భ‌లో కాంగ్రెస్ వినూత్న ప్ర‌యోగం..! ప్ర‌తిప‌క్ష నేత ఎంపికలో విజ‌య‌వంతం..!!

శాస‌న స‌భ‌లో కాంగ్రెస్ వినూత్న ప్ర‌యోగం..! ప్ర‌తిప‌క్ష నేత ఎంపికలో విజ‌య‌వంతం..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి కోసం పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు తదితరులు పోటీపడ్డారు. మల్లు ప్రస్తుతం మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతే ప్ర‌తిప‌క్ష నేత ఎవ‌రు అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బ‌లంగా స్పందిస్తూనే అదికార పార్టీ వ్యూహాల‌కు చెక్ పెట్టాలంటే విక్ర‌మార్కుడే స‌రైన అభ్య‌ర్ధి అని భావించిన రాహుల్ గాంధీ అత్యుత్త‌మ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అదికార పార్టీని సెంటిమెంట్ తో కొట్టిన కాంగ్రెస్..! కాంగ్రెస్ నుండి వ‌ల‌స‌ల‌కు బ్రేక్..!!

అదికార పార్టీని సెంటిమెంట్ తో కొట్టిన కాంగ్రెస్..! కాంగ్రెస్ నుండి వ‌ల‌స‌ల‌కు బ్రేక్..!!

ఇక విక్ర‌మార్క ను శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయ‌డంతో అదికార గులాబీ పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. అటుఇటు కాకుండా సందిగ్దంలో ఉన్న కాంగ్రెప్ ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు లాక్కుని కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ద‌క్క‌కుండా చేద్దామ‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించిన అదికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ తో చెక్ పెట్టింది. గ‌తంలో దిళితున్ని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌శేఖ‌క‌ర్ రావు ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు ఎర వేయ‌డం వెన‌క ఆయ‌న వ్యూహం ఏంట‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశంలో అదికార పార్టీ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోతే టీఆర్ఎస్ కే దెబ్బ‌..! శ‌రాఘాత‌మైన సెంటిమెంట్..!!

కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోతే టీఆర్ఎస్ కే దెబ్బ‌..! శ‌రాఘాత‌మైన సెంటిమెంట్..!!

తెలంగాణ లో అదికార పార్టీకి సెంటిమెంట్ శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింది. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీ అదికారంలోకి వ‌స్తే మొద‌టి ముఖ్య‌మంత్రిని ద‌ళితున్ని చేస్తాన‌ని చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌లు సంద‌ర్బాల్లో వెల్ల‌డించారు. గులాబీ పార్టీ అదికారంలోకి వ‌చ్చాక ఆ ఊసే ఎత్త‌లేదు చంద్ర‌శేఖ‌ర్ రావు. అంతే కాదు రెండ‌వ‌సారి టీఆర్ఎస్ అదికారంలోకి వ‌చ్చినప్ప‌టికి ఆ వాగ్దానాన్ని చంద్ర‌శేఖ‌ర్ రావు నిల‌బెట్టుకోలేకపోయారు. గ‌తంలో క‌న్నా ఇప్పుడు అదికార గులాబీ పార్టీకి బంప‌ర్ మెజారిటీ వ‌చ్చింది. ఐన‌ప్ప‌టికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను మ‌రింత నిర్వీర్యం చేసే దిశ‌గా టీఆర్ఎస్ అడుగులు వేస్తున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. అదికార పార్టీ వ్యూహాల‌ను ప్ర‌తిప‌క్ష నేత ఎంపిక‌తో కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.

ద‌ళితున్ని సీయం చేయ‌లేదు..ప్రతిప‌క్ష నేతాగా ఉండ‌నీవ‌రా..! గులాబీ పార్టీకి కాంగ్రెస్ సూటి ప్ర‌శ్న‌..!!

ద‌ళితున్ని సీయం చేయ‌లేదు..ప్రతిప‌క్ష నేతాగా ఉండ‌నీవ‌రా..! గులాబీ పార్టీకి కాంగ్రెస్ సూటి ప్ర‌శ్న‌..!!

కాంగ్రెస్ పార్టీనుండి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల‌లో సాద్య‌మైనంత ఎక్కువ మందిని త‌మ పార్టీలో క‌లుపుకుందామ‌ని, త‌ద్వారా ఆ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా అడ్డుకోవ‌చ్చ‌నేది అదికార పార్టీ ప్ర‌ధాన వ్యూహంగా తెలుస్తోంది. ఒక వేళ కంగ్రెస్ పార్టీనుండి ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా అర్హ‌త కోల్పోతుంది. అంటే శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ద‌ళితుడు ని అడ్డుకునే ప్ర‌య‌త్నం అదికార గులాబీ పార్టీ చేస్తోంద‌నే సంకేతాల‌ను ప్ర‌జ‌ల్లోకి పంపొచ్చ‌నేది కాంగ్రెస్ పార్టీ మాస్ట‌ర్ ప్లాన్ గా తెలుస్తోంది. దిళితునికి ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ఇవ‌వ్వ‌క పోగా శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా కూడా ఉండ‌నివ్వ‌రా అనే అంశాన్ని ప‌బ్లిక్ చేయాల‌నేది కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌. దీంతో అదికార గులాబీకి సెంటిమెంట్ చుర‌క‌త్తిలా ప‌రిణ‌మించింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
In Telangana, the sentiment of the party has evolved. Chandrashekhar Rao revealed that in the first instance, the TRS party would come in the same way that the first chief minister would make a dalit. Chandra Shekhar Rao did not do that after coming into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X