హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్, సంతోష్‌కు రాఖీ కట్టిన కవిత: మహిళా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని కేటీఆర్ ఇంటికి వచ్చిన ఆమె కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కూ రాఖీ కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కవితతో పాటు సంతోష్ కుమార్ చెల్లెలు సౌమ్య ఇద్దరికీ రాఖీ కట్టారు.

Recommended Video

తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు | Private Hospitals దుర్మార్గం || Oneindia Telugu

మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగడి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, గండ్ర జ్యోతి తదితరులు కేటీఆర్, సంతోష్‌లకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ పాల్గొన్నారు. ఈ ఉదయం నుంచి టీఆర్ఎస్‌కు చెందిన పలువురు మహిళా నాయకులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారందిరికీ కృతజ్ఙతలు తెలిపారు.

TRS former MP Kalvakuntla Kavitha ties Rakhi to her brother and Minister KTR

తెలంగాణ వ్యాప్తంగా తనకు అక్కచెల్లెమ్మలు ఉన్నారని, వారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని చెప్పారు. కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలతో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామని అన్నారు.

TRS former MP Kalvakuntla Kavitha ties Rakhi to her brother and Minister KTR

రాజకీయంగా మహిళలను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందంజలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలను తమ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని చెప్పారు. నిత్యావసర సరకులను అందజేస్తున్నామని అన్నారు.

English summary
TRS former MP Kalvakuntla Kavitha ties Rakhi to her brother and Municipal Administration of Telangana KTR on the eve of Rakshabandhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X