హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్‌దే - కేటీఆర్ దిశానిర్దేశం

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పాలనతో తెలంగాణలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ ఫలాలను అందుకుందని, ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఎస్పీ బాలు కండీషన్ సీరియస్ - ప్రార్థనలు చేయాలంటూ ప్రముఖల పిలుపు - అసలేం జరిగింది?ఎస్పీ బాలు కండీషన్ సీరియస్ - ప్రార్థనలు చేయాలంటూ ప్రముఖల పిలుపు - అసలేం జరిగింది?

పంచాయ‌తీ నుంచి అసెంబ్లీ వ‌ర‌కు అన్ని ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించిందని, త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబి దళం సత్తాచాటుతుందని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

trs govt gave employment to 15 lack in 6years, will win in Graduate MLC elections:KTR

అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియకు పార్టీ శ్రేణులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కేటీఆర్ నిర్దేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని పిలుపునిచ్చారు.

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకేమంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అపూర్వమైన పాలన సంస్కరణలు తీసుకొచ్చిందని, 60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదిస్తోంటే, ప్రతిపక్షాలు మాత్రమే దివాలా తీశాయని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఉందని మంత్రి వ్యాఖ్యనించారు.

English summary
Minister KTR announced that Rs 2 lakh crore has been invested in the state in the last six years and about 15 lakh people have been provided employed in the companies set up with them and Nearly one lakh jobs have been replaced through various recruitment processes. The party working president called on the TRS party ranks to work for a solid victory for the party in the upcoming Graduate MLC elections. KTR on Wednesday held a teleconference with the election in-charges of graduate MLCs of Warangal, Khammam and Nalgonda districts today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X