హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరమంతా ఉచిత వైఫై , రూ. 1900 కోట్లతో మిషన్ భగీరథ పైప్ లైన్ ... టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని తెగ తాపత్రయ పడుతున్న టిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా గ్రేటర్ వాసుల దగ్గరకు ఓట్ల కోసం వెళ్లబోతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది.

గ్రేటర్ ఎన్నికల వేళ ... మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర .. కారణం ఇదే !!గ్రేటర్ ఎన్నికల వేళ ... మీ సేవా కేంద్రాల వద్ద జనజాతర .. కారణం ఇదే !!

 నేతలకు డిశా నిర్దేశం చేసిన కేసీఆర్ ... చెప్పిందిదే

నేతలకు డిశా నిర్దేశం చేసిన కేసీఆర్ ... చెప్పిందిదే

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టిఆర్ఎస్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఈ ఎన్నికలలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని, బిజెపికి గ్రేటర్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు అధినేత కెసిఆర్. దుబ్బాక ఎన్నికల ఫలితాలను పూర్తిగా మైండ్ లో నుండి తీసెయ్యాలని నేతలకు చెప్పారు. ఇన్నాళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లో చేసిన అభివృద్ధితోపాటు గా, కరోనా సమయంలోనూ, వరదల సమయంలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అందించిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పేర్కొన్నారు .

బీజేపీ అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని ఆదేశం ... మ్యానిఫెస్టో విడుదల

బీజేపీ అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని ఆదేశం ... మ్యానిఫెస్టో విడుదల

బిజెపి నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా తో సహా అన్ని వేదికలపై ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ గ్రేటర్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ మేనిఫెస్టోను రూపొందించామని పేర్కొన్నారు. నగరమంతా ఉచిత వైఫై అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు .

 ఇక టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టో లోని అంశాల విషయానికొస్తే

ఇక టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టో లోని అంశాల విషయానికొస్తే

1900 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పైప్ లైన్ .. నగరమంతా వైఫై .. మ్యానిఫెస్టో ఇదే


1900 కోట్ల రూపాయలతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైప్ లైన్ వేస్తామని పేర్కొన్నారు. కొత్తగా 4 ఆడిటోరియంలను నిర్మించాలని నిర్ణయించినట్లు, జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని గ్రంథాలయాలలో ఆధునీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. హైదరాబాదులో 130 కోట్ల రూపాయలతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు . హైదరాబాద్లో ఆధునిక సౌకర్యాలను, క్రీడా వసతులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో నగరమంతా ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని, మూసి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ శుద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

English summary
The ruling TRS party has released its election manifesto in the wake of the Greater Hyderabad Municipal Corporation elections. The TRS party, which has been urging the tribe to hoist the pink flag in Greater Hyderabad this time too, is going for votes to the people of Greater Hyderabad through its election manifesto. The TRS party, which released a 16-page manifesto on Wednesday in this regard, said it would provide free wifi and Mission mission bhagiratha with 1900crore rupees .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X