హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు ..పరకాల,చెన్నూరు,మరిపెడ మున్సిపాలిటీలు కైవసం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Municipal Election Results : TRS Set To Sweep || Oneindia Telugu

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తుంది . కారు రాయిన దూసుకుపోతుంది . టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

లైవ్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, పెద్దపల్లి మున్సిపాలిటీతో టీఆర్ఎస్ బోణీలైవ్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, పెద్దపల్లి మున్సిపాలిటీతో టీఆర్ఎస్ బోణీ

పరకాల, చెన్నూరు, మరిపెడ మున్సిపాలిటీలలో గులాబీల హవా


మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆరంభంలోనే బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు, మరిపెడ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 15 డివిజన్ లలో టీఆర్ఎస్ విజయం సాధించి మరిపెడ మున్సిపాలిటీ దక్కించుకుంది.

కొనసాగుతున్న కౌంటింగ్ .. లీడ్ లో టీఆర్ఎస్

కొనసాగుతున్న కౌంటింగ్ .. లీడ్ లో టీఆర్ఎస్

పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. నేడు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రతి వార్డుకు రెండు టేబుట్స్‌ను ఏర్పాటు చేశారు.ఇక పూర్తిగా మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి లెక్కిస్తున్నారు.

నిజామాబాద్ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం

నిజామాబాద్ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం

120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.వారందరి రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. 60 వార్డులు ఉన్న నిజామాబాద్ కార్పొరేష‌న్‌లో ఫలితాలు కాస్త ఆల‌స్యంగా వెలువడే అవకాశముంది. అటు కౌంటింగ్‌ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్‌ సెంట‌ర్ల దగ్గర 144 సెక్షన్‌ విధించారు.రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ.. ధీమాలో టీఆర్ఎస్

రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ.. ధీమాలో టీఆర్ఎస్

ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు పరీక్ష కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ పరిధిలో విజయం సాధిస్తామన్న ధీమాలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారటంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది . అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది . ఇక అన్ని పార్టీల్లోనూ ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయన్న నేపధ్యంలో అన్ని పార్టీల కీలక నాయకులు ఫలితాలపై దృష్టి సారించారు.

English summary
Municipal election results in Telangana state .. The counting continues. Telangana Municipal election results show that the ruling TRS party vigor at the beginning. The car is rocking. The TRS lead is clearly in the spotlight. The TRS took over the municipalities of Parakala and Chennuru. A total of 18 wards were secured in Chennuru. A total of 22 wards were sweep in parkal .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X