హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కు షాక్ .. హరీష్ పై ఓ టీఆర్ఎస్ నేత ప్రేమ .. హరీష్ సీఎం కావాలని మొక్కు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో, ఆ తర్వాతి స్థానంలో అంతటి క్రేజ్ హరీష్ రావుకు ఉండేది. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ తర్వాతి స్థానం కెసిఆర్ కుమారుడు కేటీఆర్ కే అని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పి కెసిఆర్ చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో హరీష్ రావు ను పక్కనపెట్టినట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇక హరీష్ వర్గం అని చెప్పాలంటేనే పార్టీ నేతలు భయపడిన పరిస్థితి.

తిరుపతి పుణ్య క్షేత్రంలో కక్కుర్తి పడ్డాడు .. నిలువు దోపిడీకి గురయ్యాడుతిరుపతి పుణ్య క్షేత్రంలో కక్కుర్తి పడ్డాడు .. నిలువు దోపిడీకి గురయ్యాడు

 హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబ గుడిలో 1016 టెంకాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత

హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబ గుడిలో 1016 టెంకాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత

ఇలాంటి ప్రతికూల పరిణామాలతో హరీష్ రావు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. హరీష్ రావు సి యంగా సమర్ధుడు అని అభిప్రాయపడిన అతను, తన అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నారు. హరీశ్‌రావు సీఎం కావాలంటూ టీఆర్‌ఎస్‌ నేత విష్ణు జోగుళాంబ గుడిలో 1016 టెంకాయలు కొట్టారు. టిఆర్ఎస్ నేత విష్ణు మాట్లాడుతూ హరీశ్‌రావును దమ్మున్న నాయకుడిగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హరీశ్‌ ఎంతో కష్టపడ్డారని ప్రారంభోత్సవానికి హరీశ్‌రావును పిలవకపోవడం సరికాదని విష్ణు పేర్కొన్నారు.

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ నేత, హరీష్ అభిమాని విష్ణు

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ నేత, హరీష్ అభిమాని విష్ణు

హరీష్ రావు సీఎం కావాలని ఒక అభిమాని 1016 కొబ్బరికాయలు కొట్టడం గులాబీ బాస్ కెసిఆర్ కు, అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ అని చెప్పాలి. బయటకు వ్యక్తం చేయకున్నా హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు హరీష్ ను పక్కన పెట్టారు అన్న వాదనకు తెరలేపాయి. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు పేరు ఎవరు కనీసం ప్రస్తావించ కూడదని ప్రాధాన్యత తగ్గించిన కేసీఆర్ కు హరీష్ సీఎం కావాలని టిఆర్ఎస్ నేత మొక్కు చెల్లించడం నిజంగానే షాకింగ్ న్యూస్.

విష్ణు వ్యాఖ్యలపై హరీష్ ఎలా స్పందిస్తారు ? టీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది

విష్ణు వ్యాఖ్యలపై హరీష్ ఎలా స్పందిస్తారు ? టీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది


విష్ణు వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి తో పాటు ఈ ఘటనతో ఇప్పుడు టిఆర్ఎస్ లో కలకలం మొదలైందని చెప్పాలి.

ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ మంట చల్లారేది కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది.. మొత్తం మీద టీఆర్ఎస్ లో అంతర్గతంగా చాలా పరిణామాలు జరుగుతున్నాయని , ఒక్కొక్కటిగా అవి బయటకు వస్తాయని తాజా సంఘటనలతో అర్ధం అవుతుంది.

English summary
TRS leader Vishnu in Jogulamba temple has hit 1016 coconuts to become the Harish Rao CM. TRS leader Vishnu has described Harishrao as a capable leader. Vishnu said that Harish Rao was not invited to the inauguration as Harish worked hard for the Kaleshwaram project.It is a shock to TRS boss KCR and TRS working president KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X