హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు బీజేపీ ఏం ఇచ్చింది, ఏం ఇవ్వనుంది.. కమలదళంపై కవిత నిప్పులు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం పీక్ స్టేజీకి చేరింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేవైఎం యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య.. హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు. దానిపై కవిత కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ హైదరాబాద్ కోసం బీజేపీ ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు.

సిటీ డెవలప్ కోసం టీఆర్ఎస్ అహోరాత్రులు శ్రమించిందని తెలిపారు. ఇతర నగరాలకు దీటుగా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. మిగతా నగరాలను మించి అమెజాన్, గూగుల్ కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నేతలు టూరిస్టులా మాదిరిగా వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు.

trs leader kavitha slams bjym leader tejasvi surya

తేజస్వి సూర్య బాధ్యతగా మాట్లాడలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ఇంతకీ బీజేపీ హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది, ఏం ఇవ్వనుంది అనే అంశాలపై మాట్లాడాలని కవిత సూచించారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ నేతలు మాట్లాడే మాటలకు యువత ఆవేశ పడొద్దని కోరారు.

Recommended Video

KTR Interview: KTR About Hyderabad Development | Oneindia Telugu

నామినేషన్ల విత్ డ్రా తర్వాత గ్రేటర్ బరిలో 1121 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 150 వార్డులకు 1893 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి అన్ని డివిజన్లలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిసి 500 మందికిపైగా పోటీలో నిలిచారు.

English summary
trs leader, mlc kavitha slams bjym leader tejasvi surya on hyderabad development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X