• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫారెస్ట్ మహిళా అధికారిపై దాడి హేయనీయం.. కాంగ్రెస్ పార్టీకి అస్త్రం.. రాజ్యసభలోనూ చర్చ

|

హైదరాబాద్‌ : తెలంగాణలో మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్ల తీరు సరికాదంటూ మండిపడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడమే గాకుండా విచక్షణారహితంగా దాడులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అస్త్రం దొరికినట్లైంది. అటు రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చ జరగడం గమనార్హం.

సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ కృష్ణ వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఇలాంటి ప్రవర్తన తగదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులను రెచ్చగొడుతూ తమ పబ్బం గడువుకోవాలనే విధానం సరికాదంటున్నారు కొందరు.

  ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి కోరిన మంత్రి బాలినేని
   చర్యలు తప్పవు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

  చర్యలు తప్పవు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

  కాగజ్ నగర్ ఏరియాలోని సాల్సరాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు ఆ ఘటనలో కీలకపాత్ర పోషించడంతో ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తోంది. అంతేకాదు అటు రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది.

  అటవీశాఖ మహిళా అధికారిపై జరిగిన దాడిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. ఆ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. అలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులపై దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడించారు. అధికారులపై దాడులు చేసే అనైతిక చర్యలపై స్పందించాల్సిన బాధ్యత తమకు ఉందని.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  అదలావుంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆ దాడిని ఖండించారు. ఆ ఘటనకు సంబంధించి కేసు నమోదైందని.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.

  ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..!

  ఎఫ్ఆర్వోపై దాడి హేయనీయం.. కోమటిరెడ్డి ఫైర్

  ఎఫ్ఆర్వోపై దాడి హేయనీయం.. కోమటిరెడ్డి ఫైర్

  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఖండించింది. ఎమ్మెల్యే సోదరుడు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై కర్రలతో దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇలాంటి ఘటనలకు ఆద్యులు కావడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అటవీశాఖ సిబ్బందికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. ఆ క్రమంలో వారికి ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  రాష్ట్రంలో ఆటవిక పాలన.. సీఎం ఆడంబారాలకే పరిమితం..!

  సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కూడా ఆ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ లీడర్ల చేతిలో తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళ అధికారి అనితను ఫోన్‌లో పరామర్శించారు. తెలంగాణలో ఆటవిక పాలన సాగుతోందని ఫేస్‌బుక్ వేదికగా ఆరోపణాస్త్రాలు గుప్పించారు.

  అధికారులకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

  ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. రాష్ట్రంలో పాలన కొరవడిందా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడంబరాలకు పరిమితమయ్యారని.. ఆ క్రమంలో రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  English summary
  TRS Leaders attack on woman forest range officer controvorsy may trouble the telangana government. Central Minister Prakash Javadekar responded on this issue in rajyasabha. He said that necessary actions will be taken. Congress Leaders also fires on government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X