హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చాలా బాధాకరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

దిశ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్ధిస్తున్నారు. సంఘటన స్థలంలోనైతే... పోలీసులపై ఏకంగా పూలు చల్లిన పరిస్థితి కనిపించింది. కాగా ఎన్‌కౌంటర్‌ను దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం సమర్ధించారు. దీంతో సీఎం మౌనం వెనక ఎంత సంఘర్షణ దాగి ఉందో అర్థం చేసుకోవాలని మంత్రి తలసాని సైతం వ్యాఖ్యానించారు.

మొత్తం మీద మెజారీటీ ప్రజలు నేతలు ఎన్‌కౌంటర్‌కు మద్దతు తెలిపారు. అయితే అయితే మానవ హక్కుల నేతలు, పలువురు రాజకీయ మేధావులు మాత్రం ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులపై కేసులు కూడ నమోదు అయ్యాయి. అయితే వీరికి తోడుగా ఎన్‌కౌంటర్‌ పై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు నిందితుల కుటుంబాలపై సానూభూతి వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ జరగడం చాల భాదకరం అని వ్యాఖ్యానించారు.

 TRS MLA Gongidi Sunitha regrets the encounter of the Disha accused

ఈ నేపథ్యంలోనే నల్గోండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత ఎన్‌కౌంటర్‌పై వల్ల నిందితుల తల్లిదండ్రులు ఎంత భాదపడ్డారో అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంధర్భంగా నిందితుల కుటుంబాలకు సైతం తాను ప్రగడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. తన నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ చర్యను ప్రజలు సమర్ధిస్తుంటే... మహిళ ఎమ్మెల్యేగా ఉండి నిందితులను సమర్ధిస్తారా.. అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

English summary
TRS MLA Gongidi Sunita regrets the encounter of the Disha accused. She expressed her deep condolence to the families of the victims of the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X