• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ మేయర్ అభ్యర్థినిగా కేకే కుమార్తె..డిప్యూటీగా మోతె శ్రీలత?: గెలుపుపై నో డౌట్స్?

|

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యాహ్నానికి హైదరాబాద్ ప్రథమ పౌరురాలెవరో తెలిపోనుంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ ఉండటం వల్ల గ్రేటర్ హైదరాబాద్‌ మేయర్ పీఠం టీఆర్ఎస్ వశం కావడం లాంఛనప్రాయమే, గ్రేటర్ హైదరాబాద్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థినిగా గద్వాల్ విజయలక్ష్మి పేరును టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె బంజారాహిల్స్ డివిజన్ నుంచి విజయం సాధించారు.

డిప్యూటీగా తార్నాక కార్పొరేటర్..

డిప్యూటీగా తార్నాక కార్పొరేటర్..

జీ విజయలక్ష్మి మరెవరో కాదు.. టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె. కేశవరావు కుమార్తెకు మేయర్ అభ్యర్థినిగా ప్రకటించడం వల్ల వెనుకబడిన వర్గానికి సరైన ప్రాతినిథ్యాన్ని కల్పించినట్టవుతుందని టీఆర్ఎస్ అగ్ర నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా- డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతా శోభన్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఆమె తార్నాక కార్పొరేటర్‌. మొన్నటి ఎన్నికల్లో ఆమె తార్నాక డివిజన్ నుంచి విజయం సాధించారు. గత డిసెంబర్ 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

గెలుపు లాంఛనమే?

గెలుపు లాంఛనమే?

150 స్థానాల్లో ఉన్న జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ 56 చోట్ల గెలిచింది. ఏకైక అతిపెద్ద పార్టీ అదే. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ.. ఎక్స్ అఫీషియో సభ్యులు భారీగా సంఖ్యలో టీఆర్ఎస్‌కు ఉన్నారు. వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫలితంగా- టీఆర్ఎస్ గెలపులాంఛనమే కానుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కాస్సేపట్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం వారి ఎన్నిక ప్రక్రియను చేపడుతారు.

మేయర్ పదవి రొటేషన్.కోసం మజ్లిస్ పట్టు?

మేయర్ పదవి రొటేషన్.కోసం మజ్లిస్ పట్టు?

మేయర్ పదవి ఎన్నికల్లో మజ్లిస్.. టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పోటీ చేశాయి. అయినప్పటికీ.. మేయర్ పీఠం కోసం మజ్లిస్ సహకారాన్ని తీసుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో- మేయర్ పీఠాన్ని మేయర్ పదవిని చెరి రెండున్నరేళ్ల పాటు పంచుకునేలా రొటేషన్ పద్ధతిని మజ్లిస్ నేతలు తెరమీదికి తీసుకుని రావచ్చని చెబుతున్నారు. ఇదివరకు మజ్లిస్-కాంగ్రెస్ రొటేషన్ పద్ధతిలో మేయర్ పదవీ కాలాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.

బీజేపీ సైతం రేసులో..

బీజేపీ సైతం రేసులో..

మరోవంక- భారతీయ జనతా పార్టీ కూడా మేయర్ పదవి కోసం రేసులో నిల్చుంది. ఈ క్రమంలో ముగ్గురి పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది. రామకృష్ణాపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ మేయర్ పదవి కోసం ఆమె పేరును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. రాధా ధీరజ్ రెడ్డితో పాటు మోండా మార్కెట్, వినాయక్ నగర్ కార్పొరేటర్లు దీపికా, రాజ్యలక్ష్మి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకుంది. రాధా ధీరజ్ రెడ్డి పేరును ఖాయం చేశారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా టీఆర్ఎస్‌కు తమ సత్తా చూపించడానికైనా బరిలో నిల్చోక తప్పదని తీర్మానించుకుంది.

English summary
Ruling TRS named G Vijayalaksmi, elected as corporator from Banjarahills division and Tanaka Corprator M Srilatha as deputy mayor candidate. G Vijayalakshmi daughter of party senior leader and Rajyasabha MP K Keshav Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X