హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ లో అంతర్మధనం .. కేసీఆర్ సభ ఇంపాక్ట్ ఇంతేనా.. నెక్స్ట్ ఎలా ?

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ ఎన్నిక లో టిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బతింది. కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. జిహెచ్ఎంసి పోరులో ఆశించిన ఫలితాలు రాకపోవడం, 100 సీట్లు వస్తాయి అనుకుంటే కేవలం 55 స్థానాలకే పరిమితం కావాల్సి రావడం టిఆర్ఎస్ పార్టీలో అంతర్మధనానికి కారణమైంది.

17 మంది మంత్రులు, 16 మంది పార్లమెంటు సభ్యులు ,35 మంది ఎమ్మెల్సీలు, 104 మంది ఎమ్మెల్యేలు వీళ్లు మాత్రమే కాకుండా కార్పొరేషన్లు, జడ్పీల చైర్మన్ లతో పాటు గులాబీ దండు విపరీతంగా ప్రచారం చేసినప్పటికీ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా ..

ఎన్నికల ప్రచారం హోరెత్తించినా టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ

ఎన్నికల ప్రచారం హోరెత్తించినా టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ

ఏకంగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి, పెద్ద ఎత్తున ప్రచారం చేసినా దాని ప్రభావం అంతగా గ్రేటర్ ఎన్నికల ఓటర్ల పై కనిపించలేదు. కేటీఆర్ విస్తృతంగా రోడ్ షో లు చేసినా, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలపై ప్రచారం చేసినా, ఎన్నికలకు ముందు వరద సాయం అందించినా సరే టిఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ గట్టిగా తగిలింది.

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలి నట్టే, ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి అయింది.

గ్రేటర్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న కేటీఆర్ కు షాక్

గ్రేటర్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న కేటీఆర్ కు షాక్

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావం, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఉండదని, ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేసినా, టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో విపరీతంగా హోరెత్తించినా ఓటర్లు మాత్రం తాము ఇవ్వదలచుకున్న తీర్పునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇక మంత్రులు రంగంలోకి దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి చిత్రాలెన్నో చేశారు . అయినప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన మేరకు రాలేదు.

బీజేపీ దూకుడును అడ్డుకోలేకపోయామని చర్చ

బీజేపీ దూకుడును అడ్డుకోలేకపోయామని చర్చ

తాజా ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ బీజేపీ దూకుడును అడ్డుకోలేకపోవడం వల్ల కొంత నష్టం జరిగినట్టుగా భావిస్తోంది. అక్బరుద్దీన్ చేసిన సమాధుల కూల్చివేత వ్యాఖ్యలు కూడా బీజేపీకి లాభం చేశాయని అధికార పార్టీ భావిస్తోంది . ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత బీజేపీకి లాభించిందని అంచనా వేస్తున్నారు. దూకుడుగా ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పార్టీ, బి జె పి లు లాభం పొందాయని, ఈ రెండు పార్టీల దూకుడుకు అడ్డుకోకపోవడంతో తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారు.

 సీఎం బహిరంగ సభ పెట్టినా కనిపించని ప్రభావం

సీఎం బహిరంగ సభ పెట్టినా కనిపించని ప్రభావం


నిరుద్యోగ యువతకు పార్టీపై ఉన్న అసంతృప్తి బిజెపి వైపు యువత ఆకర్షితులు కావడానికి కారణంగా భావిస్తున్నారు. ఇక ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం, వరదల కారణంగా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చిన, ఏకంగా బహిరంగ సభ పెట్టి వరాల జల్లు కురిపించినా ప్రజలు అంతగా వాటికి ప్రభావితం కాలేదని భావిస్తున్నారు. సిట్టింగ్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు మధ్య సయోధ్య లేకపోవడం వంటి కారణాలు కూడా టిఆర్ఎస్ పార్టీ అంచనాలు తలకిందులు కావడానికి కారణమైంది.

భవిష్యత్ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండటం అనివార్యం

భవిష్యత్ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండటం అనివార్యం


ఇప్పుడు సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గటానికి గల కారణాలను విశ్లేషించుకుని, భవిష్యత్ ఎన్నికలకు జాగ్రత్త పడకపోతే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీని అంతర్మధనం పడేశాయి. భవిష్యత్ ఎన్నికల్లో జాగ్రత్త పడకుంటే దెబ్బ తింటారని హెచ్చరించాయి . సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు ముందుంది ముసళ్ళ పండగ అని తేల్చి చెప్పాయి.

English summary
The TRS party was unexpectedly damaged in the GHMC election. The failure of the GHMC battle restricted trs party to just 55 seats . With 17 ministers, 16 MPs, 35 MLAs, 104 MLAs and not only the corporations, Zps chairmans campaigned vigorously, the TRS supremacy was not digested the failure. party started post mortem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X