హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయ నిర్మాణంపై టీఆర్ఎస్ కు ఎంఐఎం మెలిక .. అసలు మ్యాటర్ ఇదే

|
Google Oneindia TeluguNews

టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ నేపధ్యంలో పాత భవనాలను కూల్చివేసి నూతన భవనాలను నిర్మించాలని తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ భవన నిర్మాణం అవసరం లేదని, ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివెయ్యటానికి వీల్లేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు సచివాలయ భవన నిర్మాణంపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది .

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం .. ఎస్సై రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ మృతిఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం .. ఎస్సై రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ మృతి

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం చేపట్టిన కేసీఆర్ సర్కార్ పై విపక్షాల నేతల మండిపడుతున్నారు. ప్రజా దానం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇక టీఆర్ఎస్ కు ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మరోసారి ఈ వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఈ సారి ఈ ప్రస్తావన తెచ్చింది టీఆర్ఎస్ కు మిత్ర పక్షమైన ఎంఐఎం. నూతన సచివాలయం నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే మొజాం ఖాన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక నూతన సచివాలయం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. కానీ సచివాలయంలో ఉన్న మసీద్, దేవాలయం సంగతి ఏంటి..? అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

TRS verses MIM on Secreteriat construction .. the reason is ...

సచివాలయ స్థలంలో ఉన్న మసీదు ,ఆలయం మార్పును మేం ఒప్పుకోమని ఆయన పేర్కొన్నారు . ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండాలి. మసీదు, దేవాలయం రెండూ వాడుకలో ఉండాలి. ఇది ముస్లింల డిమాండ్.. ప్రభుత్వం ఈ సభా వేదికగా హామీ ఇవ్వాలి. కోర్టు లో ఉన్న అంశం అంటూ దాటవేయొద్దు అని మొజాంఖాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే దీనికి మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు . కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి . నిర్మాణానికి సంబంధించి రెండు కమిటీల రిపోర్టులను సీఎం కేసీఆర్‌కు అందజేశామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రెండు కమిటీల నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్న ఆయన కోర్టులో ఉన్న అంశాన్ని సభలో మాట్లాడలేమని , హామీలు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఎంఐఎం డిమాండ్‌ను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.

English summary
Mozam Khan, the MIM MLA, has questioned the government over the construction of the new secretariat. We are not opposed to the building of a new Secretariat. But what about the mosque and the temple in the secretariat ..? He also questioned the government. The government should guarantee on this he demanded
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X