హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

110 సీట్లు పక్కా.. గ్రేటర్‌లో గెలుపుపై కేసీఆర్ ధీమా, బీజేపీపై యుద్ధం అంటూ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీలు ఫోకస్ చేశారు. మేయర్ పీతఠం దక్కించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నాయి. టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రభావం చూపిన వారికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తోంది. అయితే ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తోందని.. నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ మధ్య అగ్గిరాజేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కమల దళ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ వల్లే ఆగిన సాయం..

బీజేపీ వల్లే ఆగిన సాయం..

బీజేపీ వల్లే గ్రేటర్‌లో వరద సాయం ఆగిపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వరద సాయం కోసం ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వరద సాయం కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను భాగ్యనగర ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

 బాధ్యులదే బాధ్యత..

బాధ్యులదే బాధ్యత..

ఎవరికి ఏ డివిజన్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఆ డివిజన్‌లో బాధ్యులు గట్టిగా పనిచేయాలని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై, పార్టీపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ, రైల్వే లాంటి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని మార్గనిర్దేశనం చేశారు. జీహెచ్‌ఎంసీలో సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ఆ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 110 సీట్లు పక్కా..

110 సీట్లు పక్కా..

గ్రేటర్‌లో 105 నుంచి 110 సీట్లు గెలుచుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరోసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని తెలిపారు. నిన్న మంత్రి తలసాని 104 సీట్లు సాధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు కేసీఆర్.. 110 వరకు గెలుచుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో గులాబీ దళం 99 డివిజన్లు గెలిచింది. ఈ సారి పెరుగుతుందని చెబుతుండగా.. దుబ్బాక బై పోల్ ఫలితం మాత్రం మింగుడు పడటం లేదు.

బీజేపీపై యుద్ధం

బీజేపీపై యుద్ధం


బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయిం. ఇటు మరోవైపు డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హాజరవుతారని వెల్లడించారు.

English summary
trs will win in ghmc 110 seats cm kcr said in telangana bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X