హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుభాళించిన "గులాబీ".. "కారు" కు పట్టం.. టీడీపీతో పొత్తు కొంప ముంచిందా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గులాబీ గుభాళించింది. కారు స్పీడ్ మరింత పెరిగింది. ఎవరెన్ని చెప్పినా, కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మలేదు. గులాబీ బాస్ ను మాత్రమే నమ్మారు. ఓటు ఆయుధంతో కారుకు పట్టం కట్టారు. మహా కూటమి రావొచ్చు, హంగ్ ఏర్పడొచ్చు ఇలాంటి ఎన్నో కథనాలకు చెక్ పెడుతూ టీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజారిటీ అందించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటినుంచి చెబుతున్నట్లుగానే బంపర్ మెజార్టీ సాధించి తెలంగాణలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు.

తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచిన కేసీఆర్ కు ఇక్కడి ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014 లో రాష్ట్రం ఏర్పడి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాయి.

సంక్షేమ పథకాలే పెద్దపీట వేశాయా?

సంక్షేమ పథకాలే పెద్దపీట వేశాయా?

2014లో టీఆర్ఎస్ మొదటిసారిగా అధికారంలోకి వచ్చి తొలి తెలంగాణ ప్రభుత్వంగా నాలుగున్నరేళ్లు పాలించింది. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించిన గులాబీ బాస్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వృద్ధులకు పింఛన్లు (ఆసరా పథకం), బీడీ కార్మికులకు పింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థికసాయం (కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్), రైతులకు ఎకరానికి 4వేల పంట పెట్టుబడి (రైతుబంధు), ప్రభుత్వ వసతి గృహాల్లో సన్నబియ్యం, అన్నింటికీ మించి కరెంట్ కోతలు లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం.. ఇలాంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయని చెప్పొచ్చు.

మహాకూటమిని అందుకే నమ్మలేదా..!

మహాకూటమిని అందుకే నమ్మలేదా..!


టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారు? టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించినా కూడా ఎందుకు నమ్మలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలకు సవాలక్ష కారణాలు సమాధానాలుగా కనిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదమనే వాదన వినిపిస్తోంది.

సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయే క్రమంలో తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబు నాయుడ్ని తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. ఒకవేళ మహాకూటమి గెలిస్తే చంద్రబాబు జోక్యం పెరుగుతుందనే భావన ఇక్కడి ప్రజల్లో కనిపించింది. అటు తెలంగాణ ఉద్యోగులు కూడా అదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థులు పోటీచేసిన చోట కాంగ్రెస్ శ్రేణులు సపోర్ట్ చేయలేదని.. కాంగ్రెస్ అభ్యర్థుల సెగ్మెంట్లలో టీడీపీ క్యాడర్ పనిచేయలేదనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

 మహాకూటమి డ్రామా ఫెయిల్..! టీఆర్ఎస్ ఖుషీ

మహాకూటమి డ్రామా ఫెయిల్..! టీఆర్ఎస్ ఖుషీ

మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ లాంటి పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలున్నాయి. మహాకూటమి కూడా ఇవే అంశాల్ని హైలైట్ చేస్తూ ఆరోపణలు గుప్పించింది. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారపర్వాన్ని వేడెక్కించిన మహాకూటమి ఓటర్ల నాడిని పసిగట్టలేకపోయింది. అయితే టీఆర్ఎస్ కు అనూహ్యమైన ఆధిక్యం లభించడంతో మహాకూటమి డ్రామాలు నడవలేదంటున్నారు గులాబీ నేతలు. అభివృద్ధిని కాంక్షించిన ప్రజలు మహాకూటమి మాటలు నమ్మలేదని.. కేసీఆర్ ను నమ్మి మరోసారి కారుకు పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ పై మరింత బాధ్యత

టీఆర్ఎస్ పై మరింత బాధ్యత

మొత్తానికి ఎన్నికల ఘట్టం ముగిసింది. అధికార పీఠం ఎవరిదో ఖరారైంది. అయితే రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ పార్టీపై బాధ్యత మరింత పెరిగినట్లే. పాత పథకాల అమలుతో పాటు ఇప్పటి మేనిఫెస్టో అమలు చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటికే అప్పుల భారం తడిసిమోపెడవుతున్న తరుణంలో టీఆర్ఎస్ కు అతి పెద్ద సవాల్. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు టీఆర్ఎస్ నుంచి మరెంతో ఆశిస్తారనడంలో సందేహం లేదు. మరి టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళుతుందో చూడాలి.

English summary
The car speed has increased even further. No matter what opposition leaders say, people do not believe. But for the second time the government is going to be responsible for the TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X