హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతి భవన్‌ను ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు

|
Google Oneindia TeluguNews

టీఆర్టీ ద్వార నిర్వహించిన పరీక్షల్లో పీఈటీ పోస్టుల ఫలితాలను విడుదల చేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రగతిభవన్‌ను ముట్టడించారు. దీంతో కాసేపు ఉద్రిక్తపరిస్థితులు నెలకోన్నాయి. అభ్యర్థుల ఆందోళనతో బేగంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.

2017లో నిర్వహించిన ఆర్టీ పీఈటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదు. దీంతో పరీక్షల్లో మెరిట్ సాధించి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. వారితో పాటు పరీక్షలు రాసిన ఎస్జీటీలతోపాటు లాంగ్వేజ్ పండిట్‌ల ఉద్యోగాలను భర్తి చేసిన ప్రభుత్వం పీఈటీ పోస్టులను మాత్రం భర్తి చేయలేదు.

TRT PET candidates conducted agitation at the CM camp office

కాగా గత వారం రోజుల క్రితమే ఎస్జీటీలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అయితే పీఈటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఇక పీఈటీ అభ్యర్థుల కంటే ముందుగా గ్రూప్-2 పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్దం అవుతుండడంతో పీఈటీ అభ్యర్థులు ఆందోళనబాట పట్టారు. తమ కుటుంభసభ్యులతో కలిసి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

English summary
TRT PET candidates conducted agitation at the Telanagan CM camp office for fill up the jobs immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X