హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌తో కలిసి ఫలితాలను మీడియాకు తెలిపారు. ఎంసెట్‌లో 75.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89 వేల 734 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిల హవా కొనసాగింది. తొలి 10 ర్యాంకులు అబ్బాయిలే పై చేయి సాధించారు.

వారణాసి సాయితేజ ఎంసెట్ 2020లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. యశ్వంత్ సాయి సెకండ్ ర్యాంక్, టీ మణి వెంకటకృష్ణ మూడో ర్యాంకు దక్కింది. కౌశల్ కుమార్ రెడ్డి 4వ ర్యాంకు, ఆద్రిక్ రాజ్ పాల్ 5వ ర్యాంకు, నాగెల్లి నితిన్ సాయి ఆరు ర్యాంకులో నిలిచారు. తవ్వకృష్ణ రమేశ్ 7, అన్నం సాయివర్ధన్ 8, సాయి వర్ధన్ 9 ర్యాంకుల పొందారు. వారణాసి వచన్ సిద్దార్థ్ 10వ ర్యాంక్ సాధించారు.

TS EACMCET 2020 RESULTS: 75.29 per cent qualified

గత నెల 9,10,11,14 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 1 లక్ష 43 వేల 326 మంది అప్లై చేసుకోగా.. 1 లక్ష 19 వేల 183 మంది హాజరయ్యాయి. ఫలితాల్లో 89వేల 734 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం 1.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Recommended Video

ఇంటర్‌ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత!! || Oneindia Telugu

దరఖాస్తు చేసుకుని కరోనావైరస్ సోకి పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మరోసారి పరీక్ష నిర్వహిస్తుంది. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కరోనా వైరస్ సోకి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది.

English summary
75.29 per cent students are qualified in the ts eamcet 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X