హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC Strike: రూ. 100కోట్లకుపైగా నష్టం, చెప్పినా విన్లేదు: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. హైకోర్టు సూచనలు చేసినా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఆర్టీసీ సంఘాలు కూడా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను విరమించేది లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. బస్ భవన్ దగ్గర లాయర్లు అరెస్ట్.. నాంపల్లి కోర్టు దగ్గర టెన్షన్ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. బస్ భవన్ దగ్గర లాయర్లు అరెస్ట్.. నాంపల్లి కోర్టు దగ్గర టెన్షన్

జీతాలకు నిధులు లేవంటూ..

జీతాలకు నిధులు లేవంటూ..

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే, కార్మికుల జీతాలు చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కార్మికుల జీతాల కోసం రూ. 239 కోట్లు అవసరం కాగా, ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద రూ. 7.49 కోట్లే ఉన్నాయని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

కార్మికుల కోసం ఎంతో చేశాం..

కార్మికుల కోసం ఎంతో చేశాం..

కాగా, ఆర్టీసీ యాజమాన్యం తరపున ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కార్మికులకు 67శాతం వేతనాలు పెంచామని అన్నారు. ఏటా రూ. 900 కోట్ల ఆర్థిక భారంతో 2015 జూన్‌లో 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని సునీల్ శర్మ తెలిపారు. రూ. 200 కోట్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ 2018 జులైలో 16శాతం మధ్యంతర భృతి ఇచ్చామని పేర్కొన్నారు. ఆర్టీసీకి 4,882 కోట్ల వార్షికాదాయం ఉండగా.. ఖర్చు మాత్రం రూ. 5,811కోట్లు అవుతోందని తెలిపారు. ప్రతి నెలా జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు.

ప్రభుత్వం చెప్పినా విన్లేదు..

ప్రభుత్వం చెప్పినా విన్లేదు..


ఆర్టీసీకి రూ. 4,709 కోట్ల అప్పులు ఉండగా.. ఉద్యోగుల పీఎఫ్, ఈఎల్, సీసీఎస్ బకాయిలే రూ. 1660 కోట్లు ఉన్నాయని సునీల్ శర్మ తెలిపారు. కార్మికశాఖ వద్ద చర్చల ప్రక్రియ పెండింగ్‌లో చట్టవిరుద్ధంగా కార్మికులు సమ్మెకు వెళ్లారని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. కార్మిక సంఘాలు మాత్రం వినకుండా సమ్మెకు దిగి.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయని తెలిపారు.

వందకోట్లకుపైగా నష్టం..

వందకోట్లకుపైగా నష్టం..

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సంస్థకు రూ. 125కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన తమ కౌంటర్‌లో వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇవ్వాలనే పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 29కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సునీల్ శర్మ కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం.

English summary
TSRTC Incharge MD Sunil Sharma counter filed at High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X