హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్వధ్దామరెడ్డి..రాజిరెడ్డి హౌస్ అరెస్ట్ : జేఏసీ నేతల దీక్షలకు బ్రేక్ : పోలీసులు వర్సెస్ కార్మికులు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరింది. ఈయూ ఆఫీస్‌లో నిరవధిక దీక్షను జేఏసీ నేతలు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, దీక్షలకు మద్దతు లేదని పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత ధర్నా చౌక్ వద్ద దీక్షలు చేయాలని భావించినా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షలకు సిద్దమవుతున్న నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా జేఏసీ నేతలు అశ్వద్దామ రెడ్డి..రాజిరెడ్డి ఇళ్లను పోలీసులు ముట్టడించారు. వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో..అక్కడకు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనేక చోట్ల దీక్షలకు ప్రయత్నిస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు.

పార్లమెంట్ లో ఆర్టీసీ ప్రస్తావన వస్తే: కాంగ్రెస్..బీజేపీ సిద్దం : ఎంపీలకు కేటీఆర్ నిర్దేశం..!పార్లమెంట్ లో ఆర్టీసీ ప్రస్తావన వస్తే: కాంగ్రెస్..బీజేపీ సిద్దం : ఎంపీలకు కేటీఆర్ నిర్దేశం..!

జేఏసీ కీలన నేతల హౌస్ అరెస్ట్

జేఏసీ కీలన నేతల హౌస్ అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల నిరసల్లో భాగంగా ఈ రోజుల దీక్షలకు పిలుపునిచ్చారు. దీనికి అనుమతి లేదంటూ ఆర్టీసీ జేఏసీ కీలక నేతలను ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తొలుత ఇందిరా పార్క్ వద్ద కార్మికులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయానికి వేదిక మార్చారు. అయినా.. జేఏసీ నేతలు ఇళ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. జేఏసీ కీలక నేతల అశ్వధ్దామ రెడ్డి..రాజిరెరడ్డి నివాసాల వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. దీంతో..కార్మికులు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో..అశ్వద్దామ రెడ్డి..రాజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీనిని నిరిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

Recommended Video

TSRTC Samme : RTC JAC Leader Ashwathama Reddy Responds On CM KCR De@d Line
డిపోల వద్ద 144 సెక్షన్..కార్మికలు అరెస్ట్

డిపోల వద్ద 144 సెక్షన్..కార్మికలు అరెస్ట్

తెలంగాణ వ్యాప్తంగా అనేక డిపోల వద్ద కార్మికులు దీక్షలకు సిద్దమయ్యారు. డిపోల ముందు దీక్షలకు ప్రయత్నిస్తున్న కార్మిక సంఘాల నేతలను..కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని..ఎవరినీ దీక్షలకు అనుమతించమని పోలీసులు స్పష్టం చేసారు. ఛలో ట్యాంక్ బండ్ సమయంలో చోటుచేసుకున్న పరిస్థితులతో ఈ సారి పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో జేఏసీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో అనేక మంది కార్మికులు అశ్వద్దామ రెడ్డి..రాజిరెడ్డి నివాసాల వద్దకు చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఇంట్లోనే దీక్ష..మేము వెనకడుగు వేసినా..

ఇంట్లోనే దీక్ష..మేము వెనకడుగు వేసినా..

పోలీసులు తమను బయటకు అనుమతించకపోయినా..తాము ఇళ్ల వద్దే దీక్షలు కొనసాగిస్తామని నేతలు ప్రకటించారు. అదే సమయంలో తాము ప్రభుత్వం ససేమిరా అంటున్న ప్రభుత్వంలో విలీనం అంశాన్ని పక్కన పెట్టినా..తమను చర్చలకు పిలవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ముందుగా నిర్ణయించిన కార్యాచరణ మేరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో డిపోల వద్ద కార్మికులు దీక్షలకు ప్రయత్నించారు. వీరికి వామపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. పోలీసుల తీరు పైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 43 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఎప్పుడనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

English summary
TSRTC Jac leaders Aswatama reddy and Raji reddy house arrest by Police. JAC called for hunger stike before all bus depos. But, police rejected permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X