• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అశ్లీలంపై సజ్జనార్ మార్క్ ఎన్‌కౌంటర్: అవి కనిపిస్తే తోలు తీయుడే: వీహెచ్ కరెక్ట్

|

హైదరాబాద్: వీసీ సజ్జనార్.. సుదీర్ఘకాలం పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇదివరకు దిశ అత్యాచారం, హత్యోదంతం కేసులో ప్రధాన నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఇటీవలే ఆయన సైబరాబాద్ కమిషనర్ పదవి నుంచి బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

నిన్న సామాన్య ప్రయాణికుడిలా..

నిన్న సామాన్య ప్రయాణికుడిలా..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా చెరగిపోని విధంగా తనదైన ముద్రను వేసిన వీసీ సజ్జనార్.. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ మీద అలాంటి చిరకాల మార్క్‌ను వేస్తోన్నారు. సంస్కరణలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇందులో భాగంగా- హైదరాబాద్‌ సిటీ బస్సులో ఓ సామాన్య ప్రయాణికుడిగా టికెట్ కొనుక్కుని మరీ ప్రయాణం చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి స్వయంగా ఆరా తీశారు. అనంతరం మహాత్మగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్‌లోనూ కలియ తిరిగారు. మరుగుదొడ్లను సైతం ఆయన స్వయంగా పరిశీలించారు. స్టాల్స్ రేట్లను తనిఖీ చేశారు.

ఆ మరుసటి రోజే సంచలన నిర్ణయం..

ఆ మరుసటి రోజే సంచలన నిర్ణయం..

ఆ మరుసటి రోజే ఓ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు సజ్జనార్. నిజానికి- ఆర్టీసీ బస్సులు కదిలే వాల్ పోస్టర్లలాగా కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి- హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి మెట్రో నగరాల్లో సినిమా నిర్మాతలు ఆర్టీసీ బస్సులపై భారీ ఫ్లెక్సీలను అతికిస్తుంటారు. తమ సినిమా ప్రమోషన్ల కోసం బస్సులను వాడుకుంటూంటారు. వేలాది బస్సులు, వేల సంఖ్యలో ట్రిప్పులను తిరుగుతుంటాయి జంటనగరాల్లో. మారుమూల కాలనీలకు సైతం వెళ్తుంటాయి. అలాంటి బస్సులకు అద్దెను చెల్లించి- తమ పోస్టర్లను అతికించుకోవడం ద్వారా మూవీ ప్రమోషన్ అద్భుతంగా ఉంటుందనే ఆలోచన నిర్మాతల్లో ఉంటోంది.

ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు..

ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు..


చాలాకాలం నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. సినిమాలో సెక్సీ సీన్లకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీసీ బస్సులపై అతికించడం వల్ల జనంలో అంచనాలకు మించిన స్థాయిలో చొచ్చుకు వెళ్తాయనేది నిర్మాతల ఉద్దేశం. సినిమా నిర్మాతలు మాత్రమే కాదు.. అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీలు సైతం తమ క్లయింట్లకు సంబంధించిన ప్రొడక్ట్‌ను జనంలోకి తీసుకెళ్లడానికి సిటీ బస్సులను వినియోగిస్తుంటాయి. కండోమ్స్ వంటి అడ్వర్టయిజ్‌మెంట్లకు సంబంధించిన పోస్టర్లు సిటీ బస్సులపై విస్తృతంగా కనిపిస్తుంటాయి.

నాడు వీహెచ్ చేసిన పని..

నాడు వీహెచ్ చేసిన పని..

ఇవన్నీ కూడా యువతను చెడుమార్గంలో నడిపించడానికి కారణాలవుతాయని సజ్జనార్ భావించారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు సైతం.. అశ్లీలకరమైన కొన్ని పోస్టర్లను చింపేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, షాలినీపాండే నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించిన భారీ బ్యానర్‌ను సిటీ బస్సులపై అతికించగా.. ఆయన వాటిని చింపేశారు. ఆయన చర్యలు అప్పట్లో తీవ్రంగా దుమారాన్ని రేపాయి. వీ హనుమంతరావు చర్యను తప్పుపట్టారు. ఇప్పుడు అలాంటి నిర్ణయాన్నే సజ్జనార్ తీసుకున్నారు.

అశ్లీల పోస్టర్లను అతికించడాన్ని నిషేధిస్తూ..

అశ్లీలాన్ని ప్రోత్సహించేలా, యువతను రెచ్చగొట్టేలా ఆర్టీసీ బస్సులపై అతికించిన పోస్టర్లన్నింటినీ తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ఏ ఒక్క బస్సు మీద కూడా అశ్లీల పోస్టర్లు గానీ, అసభ్యకరమైన చిత్రాలు గానీ ఉండకూడదని సూచించారు. ఇకముందు కూడా అలాంటి చిత్రాలు, పోస్టర్లను బస్సుల మీద అతికించకూడదంటూ నిషేధం విధించారు. నిషేధాజ్ఞలను ఆయన జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

 సైదాబాద్ తరహా ఉదంతాలు తలెత్తకుండా..

సైదాబాద్ తరహా ఉదంతాలు తలెత్తకుండా..

సైదాబాద్ సింగరేణి కాలనీలో రేపిస్ట్ మళ్లంకొండ రాజు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హత్య చేసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టించడం, అతని మృతదేహం లభించిన కొన్ని గంటలకే సజ్జనార్.. ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను తొలగించడం.. వాటిని నిషేధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి అశ్లీల పోస్టర్లు, బ్యానర్లు కూడా యువతను తప్పుదారి పట్టించడానికి కారణమౌతున్నట్లు భావించారాయన. సమాజంలో అలజడికి కారణమౌతోన్న అశ్లీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Telangana State Road Transport Corporation MD VC Sajjanar passed the instructions to remove all objectionable Posters on RTC Buses with immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X