హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC బంపర్ ఆఫర్: 12 గంటల్లో 7 ప్రాంతాలు, కేవలం 250 రూపాయలకే..

|
Google Oneindia TeluguNews

విశ్వనగరి భాగ్యనగరిలో టీఎస్ ఆర్టీసీ కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టింది. హైదరాబాద్ దర్శన్ పేరుతో మంగళవారం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఏడు చారిత్రక ప్రదేశాల్లో తిప్పనుంది. 12 గంటల పాటు జర్నీ కొనసాగనుంది. అలాగే ఫుడ్ కూడా అందజేస్తారు. ఉదయం 8.30 గంటలకు టూర్ స్టార్ట్ కాగా.. రాత్రి 8 గంటలకు ముగియనుంది.

అల్ఫా హోటల్ నుంచి స్టార్ట్

అల్ఫా హోటల్ నుంచి స్టార్ట్


ఉదయం 8.30 గంటలకు అల్ఫా హోటల్ నుంచి స్టార్ట్ అవనుంది. తిరిగి అక్కడే బస్ నిలిచిపోనుంది. తొలుత బిర్లా మందిర్ తీసుకెళతారు. తర్వాత చౌమహల్లా ప్యాలెస్ వెళతారు. మధ్యాహ్నం తారమతి బారదరీ రిసార్ట్ వద్ద గల హరిత హోటల్‌లో లంచ్ చేస్తారు. భోజనం పూర్తయ్యాక గోల్కొండ ప్యాలెస్, దుర్గం చెరువు పార్క్, కేబుల్ బ్రిడ్జీ, తర్వాత హుస్సెన్ సాగర్‌లో గల ఎన్టీఆర్ పార్క్ వద్దకు తీసుకెళతారు.

 ఇవీ ధరలు

ఇవీ ధరలు


మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో లగ్జరీ ఏసీలో ఈ టూర్ అందుబాటులో ఉంది. మెట్రో ఎక్స్ ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 తీసుకుంటారు. అదే మెట్రో లగ్జరీలో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 తీసుకుంటారు. తొలుత వచ్చిన కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

ఇలా బుక్ చేసుకోండి

ఇలా బుక్ చేసుకోండి


టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్ వెబ్ సైట్ నుంచి కస్టమర్లు తమ టూర్ బుక్ చేసుకోవాలని కోరుతుంది. దీనికి సంబంధించి 040-23450033, 040-69440000 రెండు హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ స్కీమ్ పర్యాటకులకు, సిటీ ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉండనుంది. ఆ ధరకు 7 ప్రాంతాల సందర్శన వర్త్ పుల్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎక్స్ లెంట్

ఎక్స్ లెంట్


ఇదీ ఎక్స్ లెంట్ కార్యక్రమం అని మరొకరు అన్నారు. మరికొందరు మాత్రం డివైడ్ టాక్ చేశారు. ఇందులో చార్మినార్ మిస్ అయ్యిందని మరొకరు అన్నారు. సిటీ ట్రాఫిక్‌లో 7 ప్రాంతాలను చుట్టేయడం మంచిదేనని ఇంకొకరు అన్నారు.

English summary
TSRTC launched ‘Hyderabad Darshan’ scheme. visitors will be taken to seven iconic destinations across the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X