హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, కోర్టులో ముగిసిన వాదనలు.. తేలని ఫలితం... 11కు వాయిదా

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తిరిగి కేసును ఈనెల 11కు వాయిదా వేసింది. ఉదయం 11 గంటల నుండి కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా అధికారులు సమర్పించిన తప్పుడు నివేదికలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఐఏఎస్ అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులపై కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు మానవతా దృక్పథంతో వ్యవహరించి సమ్మెను విరమించేలా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించింది.

పురోగతి లేని కోర్టు వాదనలు

పురోగతి లేని కోర్టు వాదనలు

ఆర్టీసీ సమ్మెపై కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో నేడు జరిగిన వాదనల్లో కూడ ఎలాంటీ పురోగతి కనిపించలేదు. సమ్మె విరమణకు సంబంధించి ఎలాంటీ ఆదేశాలు జారీ చేయలేదు. ప్రభుత్వ నివేదికలపై వాదనలు విన్న చీఫ్ జస్టీస్ పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రభుత్వం తరుపున వాదనలు వినడంతో పాటు అధికారులపై ఆగ్రహం చేశారు. దీంతో కేసును ఈనెల 11కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

మొదటికి వచ్చిన ఆర్టీసీ వ్యవహారం

మొదటికి వచ్చిన ఆర్టీసీ వ్యవహారం

ఇక ఆర్టీసీ విభజనకు సంబంధించి కోర్టులో కోత్త వాదనలు జరిగాయి. అసలు ఆర్టీసీ అంటే ఏపీఎస్ ఆర్టీసీనా.. లేక టీఎస్ ఆర్టీసీనా అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసి విభజన జరిగిందా అంటూ వివరాలు సేకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరుపుణ వాదనలు వినిపించిన ఏజీ పలు అంశాలు వివరించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ విభజన కాలేదని, తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటీ అధికారిక సమచారం లేదని చెప్పారు. అయితే ఆర్టీసీ విభజన చట్టంలోని 9వషెడ్యుల్ ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఆసౌకర్యంగా ఉండడంతో తాత్కాలిక విభజన చేసినట్లు తెలంగాణ అధికారలు కోర్టుకు వివరించారు.

క్షమాపణలు కోరిన ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి

క్షమాపణలు కోరిన ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి

కోర్టు ఆదేశాలతో తెలంగాణ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణరావుతో పాటు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మకు కోర్టుకు హజరై తమ వాదనలు వినిపించారు. గతంలో సమర్పించిన నివేదికల్లో తప్పుడు సమచారం ఇవ్వడంపై ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు కోర్టును క్షమాపణలు కోరారు. అయితేకోర్టు మాత్రం అధికారుల క్షమాపణలపై సిరియస్ అయింది. . తప్పుడు నివేదికలు ఇచ్చి, క్షమాపణలు కొరితే సరిపోతుందా అంటూ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రులకు తప్పుడు నివేదికలు ఇచ్చిన వారు కోర్టుకు ఇచ్చిన వాటిని ఎలా నమ్మాలని ప్రశ్నించింది.

English summary
Arguments in the High Court on RTC are over. The case has been postponed to 11th of this month. The court heard the case from 11 am and addressed several issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X