హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్‌లో తేలనున్న భవితవ్యం

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వం తరుపు కోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయమూర్తి అగ్రహం వ్యక్తం చేసిన అంశాలపై చర్చించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. క్యాబినెట్ సమావేశంలో గత 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మెపై పలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్టు సమాచారం.

టీఎస్ఆర్టీసీ సకల జనుల సమరభేరీలో విషాదం: డ్రైవర్ మృతిటీఎస్ఆర్టీసీ సకల జనుల సమరభేరీలో విషాదం: డ్రైవర్ మృతి

ఆర్టీసీ భవితవ్యవం శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్‌లో తేల్చేందుకు సీఎం కేసిఆర్ రెఢి అయ్యారు. గత ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే అటు ప్రతిపక్ష పార్టీల నుండి ఇటు న్యాయస్థానాల్లో కూడ ప్రభుత్వానికి చుక్కెదురు అవుతోంది. దీనికి తోడు ప్రయాణికులు కూడ అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దీంతో ఆర్టీసీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యకు పరిష్కారాలు, పత్నామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయాలు అమలు చేయడమే తరువాయిగా మారింది.

TSRTC strike,CM KCR once again held a review meeting on the RTC strike

ముఖ్యంగా ఆర్టీసీలో యాబై శాతం మేర ప్రైవేటు బస్సులు తిప్పాలనే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్రం ఇటివల తీసుకువచ్చిన నూతన మోటారు వాహానాల చట్టం ద్వార కార్పోరేషన్‌కు సంబంధించి యాబై శాతం, మిగతా యాబై శాతం అద్దె మరియు ప్రైవేట్ బస్సులతో పాటు స్టేజీ క్యారియర్‌లను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఇందుకోసం పరిపాలన పరమైన నిబంధనలపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్ కూడ ఇచ్చారు. అధికారులు సిద్దం చేసిన నివేదికపై చర్చించి వాటికి అమోదముద్ర వేయనున్నారు.

English summary
CM KCR once again held a review meeting with officials and ministers on the future consequences of the RTC strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X