హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతి భవన్ ముట్టడి టెన్షన్ టెన్షన్.. రచ్చ రచ్చ.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికులకు మద్దతుగా వివిధ రాజకీయ పక్ష నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు అండగా నిలబడుతున్నాయి. ఆ క్రమంలో సోమవారం (21.10.2019) నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్‌‌ రావడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కట్టడి చేసే క్రమంలో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఉధృతమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఉధృతమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు వివిధ పార్టీలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్టయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు నగరబాట పట్టారు.

ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్‌‌లో అపర చాణక్యుడు..!ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్‌‌లో అపర చాణక్యుడు..!

ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల రాక.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్

ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల రాక.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్

ప్రగతి భవన్ ముట్టడి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయా జిల్లాల్లో పోలీసులు వారిని కట్టడి చేస్తున్నప్పటికీ వివిధ మార్గాల్లో నగరానికి వస్తున్నారు. ఆ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అంతేకాదు బేగంపేటలోని ప్రగతి భవన్‌కు దారి తీసే పలు ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రూట్ మళ్లించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.

సికింద్రాబాద్ - పంజాగుట్ట మార్గంలో ఫుల్లుగా ట్రాఫిక్ జామ్

సికింద్రాబాద్ - పంజాగుట్ట మార్గంలో ఫుల్లుగా ట్రాఫిక్ జామ్

సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మార్గంలో రాకుండా నిలువరించడానికి బేగంపేటలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తూ సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాల నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో బేగంపేట దాటడానికి గంటల సమయం తీసుకుంటోంది. దాంతో వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కి మళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు లక్డీకాపూల్, ఖైరతాబాద్ మీదుగా ప్రగతి భవన్ వైపు వచ్చే మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

సిరిసిల్లకు ఇక బ్రాండ్ ఇమేజ్.. కొత్త టెక్నాలజీతో పట్టు చీరసిరిసిల్లకు ఇక బ్రాండ్ ఇమేజ్.. కొత్త టెక్నాలజీతో పట్టు చీర

10 రోజుల జేఏసీ కార్యాచరణ.. వివిధ ఆందోళన కార్యక్రమాలు

10 రోజుల జేఏసీ కార్యాచరణ.. వివిధ ఆందోళన కార్యక్రమాలు

అదలావుంటే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పది రోజుల కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంద్ సక్సెస్ అయిన నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతంగా మార్చాలనేది జేఏసీ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ క్రమంలో వివిధ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా షెడ్యూల్ రూపొందించారు జేఏసీ నేతలు.

21వ తేదీన డిపోల ఎదుట కార్మిక కుటుంబాలతో దీక్షలు
22వ తేదీన మా పొట్ట కొట్టొద్దని తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు అందించడం
23వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను,ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి సమ్మెలో భాగస్వాములు కావాలని కోరడం
24వ తేదీన మహిళా కండక్టర్ల దీక్షలు
25వ తేదీన హైవేలు, ఇతర రహదారులు దిగ్భందన కార్యక్రమం
26వ తేదీన ఆర్టీసీ కార్మికుల పిల్లలతో నిరసన దీక్షలు
27వ తేదీన జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి దీపావళి పండుగ సందర్భంగా వినూత్న నిరసనలు
28, 29 తేదీల్లో వివిధ పద్దతుల్లో నిరసన కార్యక్రమాలు
30వ తేదీన 5 లక్షల మందితో ఉస్మానియా యూనివర్సిటీలో సకల జనుల సమర భేరి.. భారీ బహిరంగ సభ

English summary
The RTC strike reached its 17th day. To that end, the Congress leaders called for the Obsession of the CM's camp office on Monday. There was a huge traffic jam in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X