హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, అనుమతి లేని చలో ట్యాంక్‌బండ్... రేపు ఏం జరగనుంది..?

|
Google Oneindia TeluguNews

శనివారం ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఇందుకోసం సన్నద్దమవుతున్న నేతలు, కార్మికులను రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లాల్లోని నాయకులు, కార్మికులు హైదరాబాద్‌కు రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జేఏసీ నాయకులు హైదరాబాద్ సీపీ అంజన్‌కుమార్ వద్దకు వెళ్లి అనుమతిని కోరారు. కాని ఇందుకు సంబంధించి ఎలాంట అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఆర్టీసీ రూట్ల ప్రవేటీకరణపైన కోర్టు ఆదేశాలివే..: ప్రొసీడింగ్స్ సమర్పించండి: విచారణ వాయిదా..!ఆర్టీసీ రూట్ల ప్రవేటీకరణపైన కోర్టు ఆదేశాలివే..: ప్రొసీడింగ్స్ సమర్పించండి: విచారణ వాయిదా..!

 మిలియన్ మార్చ్‌ను తలపించేలా చలో ట్యాంక్‌బండ్

మిలియన్ మార్చ్‌ను తలపించేలా చలో ట్యాంక్‌బండ్

తెలంగాణ ఉద్యమంలో చరిత్ర సృష్టించిన మిలియన్ మార్చ్...తలపించేలా ఆర్టీసీ జేఏసీ నేతలు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత మూప్పై మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం సమ్మెపై ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్ మార్చ్ తరహాలో ఈనెల తొమ్మిదిన ట్యాంక్‌బండ్‌పై శాంతియుత ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సిద్దమవుతున్నారు.

చలో ట్యాంక్‌బండ్‌కు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

చలో ట్యాంక్‌బండ్‌కు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు

ఇక చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక జేఏసీ పలు పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కోరడంతో, కార్మికులు చేపట్టిన కార్యక్రమానికి బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇతర కమ్యునిస్టు పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.. మద్దతు ప్రకటించడంతోపాటు ఆయా పార్టీల నేతలు కూడ ఈ కార్యక్రమంలో పాల్గోనేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఒక్కరోజు ముందుగానే చర్యలు చేపట్టారు. సభకు అనుమతి లేదంటూ అరెస్ట్‌లు చేస్తున్నారు.

ముందస్తు అరెస్టుపై

ముందస్తు అరెస్టుపై

అయితే ముందస్తు అరెస్ట్‌లపై ఆయా పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. రాజ్యంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాయడం వల్ల మరింత ఆందోళణ ఉదృతం అవుతుందని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మండిపడ్డారు. ఇప్పటికే 23 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారని , ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. మరోవైపు సీపీఐ నేతలు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు అరెస్ట్‌లు కొనసాగిస్తే..కార్మికులకు మద్దతుగా సాముహిక దీక్షలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని మండిపడ్డారు.

మిలియన్‌ మార్చ్‌లో విధ్వంసం

మిలియన్‌ మార్చ్‌లో విధ్వంసం

అయితే ప్రభుత్వం ఎన్ని నిర్భంధాలు పెట్టిన రాజకీయ పార్టీల మద్దతుతో చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కంకణం కట్టుకుంది. అయితే ఉద్యమంలో భాగంగా చేపట్టిన మిలియన్ మార్చ్‌ ‌‌కు పోలీసులు పెద్ద నిర్భంధమే విధించారు. అయితే ఒకరోజు ముందుగానే హైదారాబాద్‌కు చేరుకున్న పలు ప్రజాసంఘాల నేతలు, ఉద్యమకారులు, ఎట్టకేలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. అయితే మిలియన్ మార్చ్ సమయంలో ట్యాంక్‌బండ్‌పై కొంత విధ్వంసం జరిగింది. బండ్‌పై ఉన్న పలు ఆంధ్రానాయకులకు చెందిన విగ్రహాలు ధ్వంసం కావడంతో పాటు మిలియన్ మార్చ్‌కు వచ్చిన కాంగ్రెస్ నాయకులతోపాటు మీడియా వ్యక్తులపై కూడ ఉద్యమకారులు దాడులు చేశారు. మరి శనివారం జరగనున్న ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌ ను సైతం అదే తరహాలో నిర్వహించాలని జాక్ నేతలు నిర్ణయించారు. దీంతో ర్యాలీ ఎలా కొనసాగుతుందో అనే ఉత్కంఠ నెలకోంది.

English summary
Police refused permission for the Chalo Tankbund program initiated by RTC JAC. The leaders and workers who are preparing for this are blocking and arresting them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X