హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మరో తప్పు చేయకు.. నిరంకుశం వద్దు: కోదండరాం వార్నింగ్.. జీతాల కోసం సమ్మె కాదు!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసి సమ్మెకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన ఆరోపించారు. ప్రజల పట్ల నిరంకుశంగా, అహంకార పూరితంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు అని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

నిరంకుశంగా వ్యవహరించకు

నిరంకుశంగా వ్యవహరించకు

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిరంకుశం తప్ప మరోటి కాదు. ఏ ప్రభుత్వమైనా రాజ్యంగానికి లోబడి పనిచేయాలి. ఆర్టీసీ కార్మికులు న్యాయసమ్మతంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు తమ జీతాల కోసం వాళ్లు సమ్మె చేయడం లేదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఆర్టీసీకి రాయితీలు ఇవ్వమని సమ్మె చేస్తున్నారనే తప్ప సొంత లాభాలకు కోసం కాదని కోదండరామ్ తేల్చి చెప్పారు.

రూట్లలో వస్తున్న నష్టాలకు

రూట్లలో వస్తున్న నష్టాలకు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ సంస్థకు రావాల్సిన కన్షేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బస్ పాసుల చెల్లింపులన్నీ సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రూట్లలో వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా ఆర్టీసీని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన చేశారు. కానీ ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నది అని కోదండరాం విమర్శించారు.

న్యాయసమ్మతమైన డిమాండ్లే

న్యాయసమ్మతమైన డిమాండ్లే

ఆర్టీసీని లాభాల పట్టించేందుకు తమ న్యాయ సమ్మతమైన డిమాండ్లతోపాటు కార్మికులు ట్రాన్స్‌ఫర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర అంశాలను డిమాండ్లలో చేర్చారు. ఆర్టీసీ కార్మికులు జీతాల కోసం సమ్మె చేస్తున్నారనే విషయం ముమ్మాటికి తప్పు. వారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. కార్మికులతో చర్చలు జరపకుండా ఈ అంశాన్ని సమ్మెగా మార్చి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారు అని కోదండరామ్ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వాన్ని చూసి..

ఏపీ ప్రభుత్వాన్ని చూసి..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఆర్టీసీని ప్రజా రవాణా వ్యవస్థగా చూడటం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ రోజుకు ఆ రోజు డబ్బు కోసం ఆర్టీసీ ఎదురు చూస్తున్నది. ఆర్టీసిని ప్రైవేట్ సంస్థకు అప్పగించి.. తమ వ్యక్తిగత లాభాల కోసం ప్రయత్నిస్తున్నదని కోదండరామ్ ఆరోపించారు. చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఏం కావాలో తెలుసుకోమని అధికారులను పంపారు కానీ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని అన్నారు.

కేసీఆర్ మరో తప్పు చేయకు..

కేసీఆర్ మరో తప్పు చేయకు..

ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి తప్పు చేశారు. ఇలాంటి తప్పు మరోటి చేయకుండా జాగ్రత్త పడాలని తెలంగాన జనసమితి నేత కోదండరామ్ హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం.
అన్ని సంఘాలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే తమ కార్యాచరణను ప్రకటిస్తాం అని కోదండరాం తెలిపారు.

English summary
TSRTC strike goes reached to third day. This issue becoming serious after KCR government sensational decision to scrap 48000 employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X