హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, మూడు ముక్కలుగా ఆర్టీసీ? నేడు క్యాబినెట్ కీలక భేటి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీని మూడు ముక్కలుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీని మూడు కార్పోరేషన్‌లుగా చేసేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా శనివారం సాయంత్రం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి పలు ప్రధాన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అద్దె బస్సులను పెంచడంతోపాటు శాశ్వత పరిష్కారానికి సంబంధించిన పలు ప్రత్నమ్నాయ ఏర్పాట్లకు అమోదముద్ర వేయనున్నారు.

టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్‌లో తేలనున్న భవితవ్యం టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్‌లో తేలనున్న భవితవ్యం

 నేటీ క్యాబినెట్‌లో ఆర్టీసీపై కీలక నిర్ణయాలు

నేటీ క్యాబినెట్‌లో ఆర్టీసీపై కీలక నిర్ణయాలు

ఆర్టీసీ భవితవ్యంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నాళ్లు చెబుతున్న వాదనలకు నేడు తుది రూపం తీసుకురానున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే కార్పోరేషన్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కార్మీకులు చేపడుతున్న సమ్మెకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన పావులు కదుపుతున్నారు. నష్టాల్లో ఉన్న కార్పోరేషన్‌ను సంస్కరణల ద్వార గాడిలో పెట్టాలనే యోచనలో సీఎం ఉన్నారు. ఇందుకోసం అధికారులకు పలు సూచనలు చేసీన సీఎం వాటిని అమలు చేసేందుకు సన్నద్దమవుతున్నారు.

మూడు కార్పోరేషన్లుగా

మూడు కార్పోరేషన్లుగా

ఈ నేపథ్యంలోనే నేడు సాయంత్రం మూడు గంటలకు రాష్ట్రక్యాబినెట్‌లో ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయం ఏర్పాట్లతోపాటు విధానపరంగా తీసుకున్న నిర్ణయాలకు అమోదముద్ర వేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆర్టీసీని మూడు కార్పోరేషన్‌లుగా విభజించే వైపుగా చర్చించనున్నారు. ఆర్టీసీకి కొన్ని రూట్లతో ఎక్కువగా నష్టాలు రావడం ,మరికొర్ని రూట్లలో లాభాలు వస్తున్నాయి. దీంతో దాన్ని హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్, మిగతా జిల్లాల్లో రెండుగా విభజించాలనే యోచనలో ఉన్నారు. కాగా ఈ ఆలోచన గత కొద్దికాలంగా వస్తున్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నేడు విభజన నిర్ణయానికి కూడ ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రైవేటు బస్సులకు ఆమోదముద్ర

ప్రైవేటు బస్సులకు ఆమోదముద్ర


మరోవైపు ఆర్టీసీలో యాబై శాతం మేర బస్సులను ప్రైవేట్‌పరం చేసేందుకు కూడ కసరత్తు ప్రారంభించారు. ఇందులో హైయర్ బస్సులతో పాటు కొన్ని రూట్లలో ప్రైవేట్ బస్సులను తిప్పడం స్టేజీ క్యారియర్‌లకు అనుమతులు ఇవ్వడం లాంటీ వాటికి నేడు జరిగే మంత్రిమండలిలో అమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే ప్రతిపాదన అమలు రానుంది. అద్దె బస్సులను పెంచెందుకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడ జారీ చేశారు.

 మరోసారి సుదీర్ఘ చర్చ..

మరోసారి సుదీర్ఘ చర్చ..


ఇక రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన కౌంటర్ పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కోర్టు లేవనెత్తిన అంశాలతో పాటు నేడు తీసుకోబోయో నిర్ణయాలపై సీఎం కేసీఆర్ మరోసారి శుక్రవారం సుదీర్ఘ సమీక్ష చేశారు. సుమారు నాలుగు గంటలపాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్‌శర్మ, ఇతర రవాణశాఖ ఎక్స్‌పర్ట్స్‌తో సీఎం చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన చట్టం ద్వార ఆర్టీసీని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజారవాణ వ్యవస్థలు వాటి నిర్వాహాణ, మరియు ఆర్ధిక పరిస్థితిపై చర్చించారు.

English summary
The Telangana state government is planning to divide the RTC into three corporations. and it will be discussed in the cabinet meeting sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X