హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సభకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం.. హై కోర్టులో పిటిషన్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సభకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అనుమతిని నిరాకరించారు. దీంతో ఆర్టీసీ ఐకాస నేతలు హకోర్టును ఆశ్రయించారు. కోర్టు లంచ్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. రేపే సభ నిర్వహించేందుకు ఆర్టీసీ కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో అత్యవసర విచారణ జరిపందుకు కార్మిక జేఏసీ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ముప్పైవ తేదిన సకల జనుల సభను సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.. మరోవైపు సమ్మెపై పూర్తి తీర్పును మధ్యహ్నాం తర్వాత వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీంతో ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించడంపై సీఎం కేసీఆర్ సైతం అధికారులు, అడ్వకేట్ జనరల్ కసరత్తు చేశారు. విలీనం డిమాండ్ కాకుండా ఇతర అంశాలపై చర్చించాలని కోర్టు కోరిన నేపథ్యంలోనే వాటిపై దశా నిర్ధేశనం చేశారు.

TSRTC strike,RTC jac has filed petition in high court seeking permission for public meeting

మొత్తం మీద సాయంత్రం వరకు అటు సభతో పాటు ఇటు సమ్మెపై పూర్తిస్థాయిలో కోర్టు మరోసారి వాదనలు విననుంది. అనంతరం కోర్టు తీర్పుపై స్పష్టత రానుంది. కాగా సకల జనుల భేరికి ప్రజా సంఘాలతో పాటు, అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులతోపాటు పలు పార్టీల నేతలు కూడ సభకు హజరు కానున్నట్టు తెలుస్తోంది. సాధరణంగా సభలు సమావేశాలు పెట్టుకునేందుకు కోర్టులు అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో ఓవైపు సమ్మెపై కోర్టులో వాదనలు జరుగుతుండగా సభకు అనుమతి లభిస్తుందా లేదా వేచి చూడాలి.

English summary
RTC jac has filed petition in high court seeking permission for SAKALA JANULA BHERI at saroor nager stadium in rangareddy district. ofter refused the permission by collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X