హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

tsrtc strike: ఆర్టీసీ కార్మికుల వేతనాలపై యజమాన్యం కొర్రీ, ఏజీ లేరట, విచారణ వాయిదా..

|
Google Oneindia TeluguNews

గత 52 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం, సెప్టెంబర్ నెల వేతనం కూడా రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తమకు వేతనాలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించగా.. సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తమకు మరింత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టును కోరడంతో విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

TSRTC STRIKE:సేవ్ ఆర్టీసీ పేరుతో బైక్ ర్యాలీ, 50వ రోజుకి చేరిన సమ్మె..TSRTC STRIKE:సేవ్ ఆర్టీసీ పేరుతో బైక్ ర్యాలీ, 50వ రోజుకి చేరిన సమ్మె..

వేతనం కోసం..

వేతనం కోసం..

తమకు వేతనం ఇప్పించాలని కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. తమకు మరింత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోరింది.

సరికాదు..

సరికాదు..

ఆర్టీసీ వాదనలను పిటిషనర్లు తప్పపట్టారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తుచేశారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది వరకు కార్మికులు చనిపోయారని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పూర్తి వాదనలు బుధవారం వింటామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

విలీనం కోసం ఆందోళన

విలీనం కోసం ఆందోళన

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు దిగారు. గత 52 రోజుల నుంచి నిరసన కొనసాగుతుంది. అయితే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల వేతనం కూడా అందించలేదు. దీంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. తమ వేతనాలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించాయి.

Recommended Video

TSRTC Samme : ఆర్టీసీ కార్మికులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..! || Oneindia Telugu
కేంద్రమే దిక్కు..

కేంద్రమే దిక్కు..

అక్టోబర్ 5వ తేదీకి ముందు లాగానే విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసినా.. సీఎం కేసీఆర్ మాత్రం బెట్టువీడటం లేదు. కార్మికుల విధులకు సంబంధించి మాట్లాడటం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైకోర్టులో కూడా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు రావడం వారిని కలిచివేస్తోంది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని.. ఆర్టీసీ ప్రైవేట్ రూట్లకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కార్మికుల గోడును పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఆర్టీసీ జేఏసీ మాత్రం కేంద్ర పెద్దలకు తమ సమస్యను తీసుకెళ్తామని చెప్తున్నారు.

English summary
rtc management Stretching employee salary petition on highcourt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X