హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌‌లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. వాళ్లకు మాత్రమే అనుమతి..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో రెండు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాదులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో సిటీ బస్సులకు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ బస్సులు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాదులోని 32 రూట్లలో ఈ బస్సులు నడపనున్నారు. ఉద్యోగులు ఐడీ కార్డులు చూపిస్తేనే బస్సుల్లోకి అనుమతిస్తారు.

tsrtc to operate special buses for govt employees in hyderabad

తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు వీలుగా శనివారం నుంచే సిటీలో స్పెషల్ బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో ఉద్యోగుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతించినందుకుగానూ సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.

కరోనా కారణంగా అన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్ సూత్రాన్ని పాటిస్తున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు ఎక్కడానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల్ని ఎంజీబీఎస్ కాకుండా జూబ్లీ బస్ స్టేషన్‌కు మళ్లిస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత సర్వీసులు నడపడంలేదు.

English summary
amid lockdown 4.0 restrictions continues in hyderabad, tsrtc to operate special buses for govt employees in the city, officials announced on friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X