హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మె‌పై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బందికల్గకుండా వెంటనే విధుల్లోకి చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. పండగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు, ఆర్టీసీకి ఎండీని ఇప్పటివరకు ఎందుకు నిమమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండురోజుల్లో చర్చలు పూర్తి చేసి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించింది.ఇందుకోసం ఇరువర్గాలు చొరవ చూపాలని సూచించింది.

ఆర్టీసీని విలీనం చేసేది లేదని తెలిపిన ప్రభుత్వం

ఆర్టీసీని విలీనం చేసేది లేదని తెలిపిన ప్రభుత్వం

మరోవైపు ఆర్టీసీని ఎట్టి ప్రరిస్థితుల్లో విలీనం చేసేది లేదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు. దీనివల్ల ఇతర కార్పోరేషన్లను కూడ ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్స్ వస్తాయని కోర్టుకు తెలిపారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటీ ఆటంకం కల్గకుండా చర్యలు చేపట్టామని కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. పండగసమయంలో సమ్మె చేపట్టడడం వల్ల ప్రజలు, అటు విద్యార్థులు కూడ ఇబ్బందులకు గురి అవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. ఇక ఆందోళన చేసేందుకు ఇతర మార్గాలు కూడ ఉన్నాయని కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్యభర్తల సంభంధం

భార్యభర్తల సంభంధం

ఆర్టీసీ, మరియు ప్రభుత్వం మధ్య భార్యభర్తల మధ్య సంబంధంగా అభివర్ణించింది. ఈనేపథ్యంలోనే ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా అటు ప్రభుత్వంతోపాటు ఇటు కార్మిక సంఘాలు కూడ ప్రయత్నాలు చేయాలని సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వం తరపున తీసుకున్న చర్యలను అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా చేపట్టిన చర్యలను వివవరించారు. కాగా వాదనలు ఇరువురి వాదనలు విన్న కోర్టు మరోసారి 18వ తేదికి కేసును వాయిదా వేసింది.

ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన కోర్టు

ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన కోర్టు

కాగా హైకోర్టు ఇటు ప్రభుత్వంతోపాటు, కార్మిక సంఘాలపై కూడ మొట్టికాయలు వేసింది. పండగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు ఆర్టసీకి ఎందుకు ఎండీని నిమమించలేదని ప్రశ్నించింది. రెండురోజుల్లో చర్చలు కొనసాగించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించింది. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి కార్మికులతో చర్చలు జరపాలని సూచించింది. తిరిగి 18వ తేదిన వాదనలు కొనసాగించాలని చెప్పింది.

సమ్మె కొనసాగుతోంది కార్మిక జేఏసీ

సమ్మె కొనసాగుతోంది కార్మిక జేఏసీ

కోర్టులో ఇరువర్గాల ముగిసిన తర్వాత ఆర్టీసీ జేఏసీ నాయకులు మాత్రం సమ్మె వివరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు ఆందోళనలను ఉదృతం చేసి ఈనెల 19న చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన వారు కోరారు. మరోవైపు ప్రభుత్వం ముందుకు వస్తే చర్చలకు వెళతామని జేఏసీ కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి స్పష్టం చేశారు.

English summary
Argument Continues On TSRTC Strike In High Court.it has suggested to the rtc unions that they should immediately call off the strike and start negotiations with the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X