హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇస్తే కీలక ఆధారాలు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ9 యజమాన్యాన్ని మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారం (15.10.2019) నాటికి వాయిదా వేసింది న్యాయస్థానం. టీవీ9 యజమాన్యానికి తెలియకుండా రవిప్రకాశ్ 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని.. ఈ కేసులో అతడిని కస్టడీకి అప్పగిస్తే కీలక ఆధారాలు బయటకొస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

ఈ కేసులో భాగంగా రవిప్రకాశ్‌ను విచారించడానికి పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రవిప్రకాశ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్‌గ్రేషియా తదితర బెనిఫిట్లను దొడ్డిదారిన దారి మళ్లించారని.. పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

 tv9 case raviprakash custody judgement on wednesday

నాడు - నేడు : కార్మికులకు సపోర్ట్.. ప్రభుత్వానికి వత్తాసు.. ఇదేందీ మంత్రి గారు..!నాడు - నేడు : కార్మికులకు సపోర్ట్.. ప్రభుత్వానికి వత్తాసు.. ఇదేందీ మంత్రి గారు..!

రవిప్రకాశ్ సొమ్ము డ్రా చేసుకున్న సమాచారానికి సంబంధించి బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆధారాలు అన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. అయితే రవిప్రకాశ్‌పై ఎన్‌సీఎల్‌టీ, హైకోర్టులో ఉన్న కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదని వివరించారు. కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి బోర్డు మీటింగులు పెట్టకుండా.. అధిక షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా రవిప్రకాశ్ 18 కోట్ల రూపాయల సొమ్ము అక్రమ మార్గాల్లో డ్రా చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఏ-1 ముద్దాయిగా రవిప్రకాశ్ ఉండగా.. టీవీ9 ఆర్థిక వ్యవహారాలు చూసిన మూర్తి ఏ-2 ముద్దాయిగా ఉన్నారు. అయితే మూర్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అక్రమంగా డ్రా చేసిన 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే విషయంలో విచారించాల్సి ఉందని.. ఆ క్రమంలో పది రోజుల పాటు కస్టడీకి ఇస్తే నిజాలు బయటకు వస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

English summary
tv9 ex ceo raviprakash custody petition arguments held in Nampally Court. Judge postponed to wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X