ఫేక్ ఐడీ కేసులో బెయిల్: జైలు నుంచి ‘టీవీ9’ రవిప్రకాశ్ విడుదల
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ బెయిల్‌పై శనివారం తెల్లవారుజామున విడుదలయ్యారు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన కేసులో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నేడు విడులయ్యారు.
TSRTC Strike: కేసీఆర్ మెగా ప్లాన్..ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు, సక్సెస్ ఐతే ఇక అంతే!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు

బెయిల్ మంజూరు..
ఏబీసీఎల్‌ను రూ. 18 కోట్లకు మోసగించిన కేసులో రవిప్రకాశ్ కొన్ని రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఏబీసీఎల్(అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్)ను మోసం చేసిన కేసులో అదే రోజు సైబరాబాద్ పోలీసులు పిటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని కూకట్పల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

రవిప్రకాశ్ జైలు నుంచి విడుదల
హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నకిలీ బెయిల్ ఐడీ కేసులోనూ బెయిల్ రావడంతో రవిప్రకాశ్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. కూకట్పల్లి కోర్టులో పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
కాగా, టి కృష్ణకుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టసి్ శ్రీదేవి విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తక్షణం బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించారు.

ఫేక్ ఐడీ కేసు..
అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బెయిల్ మంజూరు కావడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు రవిప్రకాశ్. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడీ కార్డు క్రియేట్ చేసినట్లు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మోసం చేశారంటూ..
కాగా, అక్టోబర్ 4వ తేదీన టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా తరపున సింగారావు ఈ ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్ తోపాటు మరో డైరెక్టర్ ఎంకేవిఎన్ మూర్తి, క్లిఫోర్డ్ పెరేరియాలపై ఫిర్యాదు చేశారు. టీవీ9 ఛానల్ విక్రయానికి ముందు వారిద్దరూ ఏబీసీఎల్ నుంచి బోర్డు అనుమతి లేకుండా తమకు డబ్బు విత్ డ్రా చేసే అధికారం లేకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాల కోసం సంస్థ ప్రయోజనాలను పట్టించుకోకుండా.. సంస్థను మోసం చేసి డబ్బు తీసుకున్నారని ఆలంద మీడియా తమ ఫిర్యాదులో పేర్కొంది.