హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు మార్చారట

|
Google Oneindia TeluguNews

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌‌, శివాజీలపై తెలంగాణా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివాజీలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక రవి ప్రకాష్ మరో మారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇదిలా ఉంటే ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ట్రేడ్ మార్క్ పై తప్పుడు అగ్రిమెంట్లపై పలు కేసులు నమోదై తప్పించుకు తిరుగుతున్న రవి ప్రకాష్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమా అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమా

టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన నాటి నుండి అంటే ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. ఇక సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నా పోలీసులు పట్టుకోవటంలో విఫలం అవుతున్నారు . ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో, వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

TV9s former CEO Ravi Prakash changed 30 SIM cards in 12 days

కాగా, తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. టీవీ9 వాటాల వివాదం ప్రస్తుతం విచారణలో ఉందని, అది పూర్తి కాకుండా, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నది రవిప్రకాశ్ వాదిస్తున్నారు. ఈనెల 22న రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టులో విచారణకు రానున్న నేపధ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది.

English summary
The Cyberabad police have issued a lookout notice against former TV9 Chief Executive Officer V. Ravi Prakash and actor S. Shivaji in connection with a forgery case that was booked against them a few days ago. Since the searches at TV9's office since 9th of this month, he has been changing two to three sims per day, police said. Police sources also found that he was talking only about WhatsApp calls via WiFi to keep his track out. In 12 days ravi prakash changed 30 sims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X