హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సజ్జనార్ Vs అసదుద్దీన్ : ట్విట్టర్ వార్‌.. దానికి సమాధానం చెప్పాలన్న ఎంపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ,సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఎవరైనా జిహాదీలు పనిచేస్తున్నారా? అని సురేష్ కొచ్చేటి అనే ఓ నెటిజెన్ సీపీని ప్రశ్నించగా.. అవును అంటూ ఆయన సమాధానమిచ్చారు.

జేఎన్‌యూ హింసాకాండ : మోదీ సర్కార్ సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీజేఎన్‌యూ హింసాకాండ : మోదీ సర్కార్ సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీ

అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు స్పెషల్ పోలీస్ టీమ్స్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. తమను అప్రమత్తం చేసినందుకు థ్యాంక్స్ అని,మీకేదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.అమెరికా-ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారా? అని ఆరా తీస్తూ సదరు నెటిజెన్ జిహాదీల గురించి ప్రశ్నించాడు.

twitter war between mp asaduddin owaisi and cyberabad cp sajjanar

సదరు నెటిజెన్ ప్రశ్నకు సీపీ అవును అంటూ సమాధానం ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 'సార్ మీరు అవును అని సమాధానం చెప్పారు కదా. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారో చెప్పగలరా?, లేదంటే మీ ఉద్దేశమేంటో చెప్పండి' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, మీరు కేవలం భక్తులకు మాత్రమే సమాధానాలు చెబుతారా? ఎంపీలకు కూడా సమాధానం చెబుతారా? అని నిలదీశారు.

తన ప్రశ్నలకు సీపీ సజ్జనార్ స్పందించకపోవడంతో ఓవైసీ మరో ట్వీట్ చేశారు. ఇటీవలి దిశా ఎన్‌కౌంటర్ గురించి అందులో ప్రస్తావించారు. 'సార్ మీరేమైనా చేయండి, కానీ తెల్లవారుజామున 5గంటలకు ఎన్‌కౌంటర్ పేరుతో నిందితులను చెప్పడం సరికాదు. అవసరమైతే వాళ్లను పట్టుకుని థర్డ్ ప్రయోగించిన సమ్మతమే,అంతే కానీ వాళ్ల కడుపులో బుల్లెట్లు దింపకండి' అని మరో ట్వీట్ చేశారు. సీపీ,ఎంపీల మధ్య చోటు చేసుకున్న ఈ ట్విట్టర్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Twitter war took place between Hyderabad MP Asaduddin Owaisi and Cyberabad Commissioner Sajjanar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X