హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్‌కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్త

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్‌లో కొత్తగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. దేశంలోని ఐదు నగరాల్లో కూడా ఇలాంటి కొత్త ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి.

హైదరాబాద్ నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) మార్గంలో ఉన్న దేవతల గుట్టలో స్థాపించారు. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(డీఎంఆర్ఎల్)కి చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) కూడా ఇక్కేడే ఉండేది. అయితే, దీని స్థానంలో ప్రధాని మోడీ సర్కారు ప్రతిష్టాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.

Two Hyderabad scientists to head new DRDO labs

హైదరాబాద్ తోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో ఈ నూతన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. స్మార్ట్ మెటీరియల్స్ పై ఇక్కడ పరిశోధనలు చేయనున్నారు. రక్షణ వ్యవస్థలో ఆధునాతన మెటీరియల్స్ కీలంగా ఉంటాయి.
తక్కువ వ్యయంలో రూపొందడంతోపాటు పనితీరు స్మార్ట్ గా, బహుముఖంగా ఉంటుంది. శత్రువుల రాడార్లు పసిగట్టడం లాంటి స్మార్ట్ మెటీరియల్స్ పై కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి

కాగా, హైదరాబాద్ తోపాటు కోల్‌కతాలోని యువ శాస్త్రవేత్తల ల్యాబ్ లకు డైరెక్టర్లుగా హైదరాబాద్ లోని డీఎంఆర్ఎల్ ఆర్సీఐ ప్రయోగశాల నుంచే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. ఆర్సీఐకి చెందిన శాస్త్రవేత్త పర్వతనేని శివప్రసాద్.. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలకు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఆర్సీఐలో యాంటి ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్స్ టెక్నాలజీ డిజైన్, అభివృద్ధిపై శోధనలు చేస్తున్నారు.

కాగా, డీఎంఆర్ఎల్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మరో శాస్త్రవేత్త రామకృష్ణన్ రాఘవన్ హైదరాబాద్ ప్రయోగశాలకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలకు నియమించిన శాస్త్రవేత్తల వయస్సు 35ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. కాగా, అత్యాధునిక సాంకేతిక పరిశోధనల కోసం డీఆర్డీవో నిర్మించిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలను ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో గురువారం ప్రారంభించి.. వాటిని జాతికి అంకితం చేశారు.

మీ సామర్థ్యం చాలా గొప్పది. మీరెన్నో ప్రయోగాలు చేయొచ్చు. మీ ఆలోచనా పరిధుల్ని విస్తృతపర్చండి. పనితీరులో కొత్త కొలమానాల్ని నిర్దేశించుకోండి. మీ ఆకాంక్షలకు రెక్కలు తొడగండి. ఎన్నో అవకాశాలున్నాయి. మీతో నేనున్నా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు భరోసా ఇచ్చారు. గగనతలం, సముద్రంతోపాటు సైబర్, అంతరిక్ష రంగాలు ప్రపంచ గమనాన్ని మారుస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.

English summary
Two scientists working in the city’s premier labs - Parvathaneni Shiva Prasad of the Research Centre Imarat (RCI) and Ramakrishnan Raghavan of the Defence Metallurgical Research Laboratory (DMRL) have been chosen to head the newly launched ‘Young Scientists Laboratories’ or DYSLs formed by the Defence Research & Development Organisation (DRDO) to start focused research in advanced technologies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X