హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాచకురాలిని వదలని మృగాళ్లు...! అన్నం పెడతామని అత్యాచారం...!

|
Google Oneindia TeluguNews

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నా... మృగాళ్లు, కామాంధుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. దేశంలో ఏమయితే..మాకేంటి అంటూ బరితెగించి తన, మన బేధం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దిశ సంఘటనత తర్వాత మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమి పట్టించుకోని ఇద్దరు మృగాళ్లు వయస్సును మరిచి మద్యం మత్తులో ఏకంగా ఆరు పదుల వయస్సున్న వృద్దురాలిపై అఘాయిత్యం చేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది.

 నగరంలోని మిర్జాలగూడలో సంఘటన

నగరంలోని మిర్జాలగూడలో సంఘటన

మద్యం మత్తులో ఓ యాచకురాలిపై ఇద్దరు మధ్య వయస్సు వ్యక్తులు అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని లాలాపేట్‌కు చెంది, యాబై సంవత్సరాల వయస్సున్న జార్జ్ ,వికారాబాద్ జిల్లా స్టేషన్ థరూర్‌కి చెందిన విజయ్ కుమార్ ‌లు ఇద్దరు తమ భార్యలను వదిలివేసి, నగరంలోని మిర్జాలగూడలో కలిసి ఉంటున్నారు. కాగా నగంలోనే పెయింటింగ్ పనులు చేస్తూ...జీవనం కొనసాగిస్తున్నారు.

అన్నం పెడతామని అత్యాచారం

అన్నం పెడతామని అత్యాచారం

అయితే గత మంగళవారం రాత్రీ ఏడుగంటలకు సుమారు 60 సంవత్సరాలు ఉన్న ఓ యాచకురాలు అన్నం కోసం వారి ఇంటిముందుకు వచ్చింది. అయితే అప్పటికే మద్యం మత్తులో జోగుతున్న ఇద్దరి కన్ను యాచకురాలలిపై పడింది. దీంతో అన్నం పెడతామిని ఇంటి ముందు ఉన్న యాచకురాలనిని, ఇంట్లోకి పిలిచారు. అనంతరం ముచ్చట్లలోకి దింపారు.. వారిని నమ్మిన యాచకురాలికి బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోవడంతో... విచక్షణ కొల్పోయిన కామంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

100కు ఫోన్ చేసిన స్థానికులు

100కు ఫోన్ చేసిన స్థానికులు

అయితే యాచకురాలిపై అత్యాచారం చేస్తున్న సమయంలో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం 100కు డయల్ చేసి విషయాన్ని చెప్పారు. దీంతో బయపడిన నిందితులు అక్కడి నుండి పారిపోయారు. నాలుగు రోజులుగా తప్పించుకుని తిరుగుండడంతో పోలీసులు శనివారం మాటు వేసి మిర్జాలగూడలోని అరెస్ట్ చేశారు. అనంతరం అత్యాచారం కేసుతో పాటు ఇతర కేసులు నమోదు చేశారు.

English summary
Two middle-aged men have raped a beggar in Hyderabad,However the victim shouted accused ran away. they were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X