హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూసీ నదికి కొత్త సోయగం.. జంట వంతెనలకు శ్రీకారం.. సరికొత్తగా చార్మినార్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : మూసీ నది ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. నగరవాసులతో పాటు టూరిస్టులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. మూసీనదిపై పాదచారుల వంతెనలు నిర్మించేందుకు లైన్ క్లియరైంది. చార్మినార్ ను ఇంటర్నేషనల్ స్థాయి టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఈమేరకు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సోమవారం ఆమోద ముద్ర వేసింది.

 టూరిస్టులకు సౌకర్యవంతం

టూరిస్టులకు సౌకర్యవంతం

సాలార్‌జంగ్ మ్యూజియం ఎదురుగా 231.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంతెన డిజైన్ కు అధికారులు ఓకే చెప్పారు. టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేలా బోర్డు గ్రీన్ సిగ్నలిచ్చింది. టూరిస్టుల రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ఈ వంతెన నిర్మించనున్నారు. చిరు వ్యాపారుల కోసం నయాపూల్ దగ్గర మరో వంతెన నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా ఉపాధి కోల్పోయే చిరు వ్యాపారులకు ఈ వంతెనలు ఊరట కలిగించనున్నాయి. వీటిపై చిరు వ్యాపారాలు జరుపుకొనే అవకాశం కల్పించనున్నారు అధికారులు. ఢిల్లీలోని పాలికా బజార్ మాదిరిగా ఈ నిర్మాణం ఉండబోతోంది. అటు మూడు వరుసలు, ఇటు మూడు వరుసల్లో షాపులు.. మధ్యలో మీటింగ్ పాయింట్ తో పాట్లు క్లాక్ టవర్ నిర్మించనున్నారు. అంతేగాదు చార్మినార్ చూడటానికి వచ్చే టూరిస్టుల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఓ మల్టీ కాంప్లెక్స్ కూడా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు.

 చార్మినార్ కొత్త అందాలు

చార్మినార్ కొత్త అందాలు


చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తోపుడు బండ్లతో పాటు ఫుట్‌పాత్ వ్యాపారాలు నిర్వహించేవారిని అక్కడినుంచి ఇప్పటికే తరలించారు. బండలు పరిచి
పేవ్‌మెంట్ పనులు పూర్తిచేయడంతో చార్మినార్ కొత్త సొబగులు సంతరించుకుంది. ఇక్కడి పనులకు ఆటంకం కలగకుండా.. చార్మినార్ దగ్గర ఇన్నర్, ఔటర్‌ రింగ్ రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించే ఏర్పాట్లు చేశారు పోలీసులు.

యువ‌త వేగానికి పోలీసుల చెక్..! నేడు ప్ర‌ధాన ఫ్లైఓవ‌ర్ల మూసివేత‌..!! యువ‌త వేగానికి పోలీసుల చెక్..! నేడు ప్ర‌ధాన ఫ్లైఓవ‌ర్ల మూసివేత‌..!!

ఎన్టీపీసీకి బాధ్యత

ఎన్టీపీసీకి బాధ్యత

చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కొత్తరూపు సంతరించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే డక్కన్ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణశైలి ఉండాలని డిసైడ్ చేశారు. చార్మినార్ ద్వారాల వంటి డిజైన్లు.. అటు వైపు వెళ్లే వీధుల్లోని భవనాలకు సైతం ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. చార్మినార్ అభివృద్ధి, సుందరీకరణ బాధ్యతను ఎన్టీపీసీకి అప్పగించారు.

English summary
The Musi river is going to be new. In addition to the inhabitants of the city, tourists will have a new experience. Line clear to pedestrian bridges construction on musi river. The project is aimed at shaping Charminar as an international level tourist destination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X