• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈ యేడు పెద్ద టాస్క్.. సమాయత్తమవుతున్న పోలీసులు.. ఫైనల్ టచ్ లో ఖైరతాబాద్ గణే

|

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంగా చెప్పుకునే ఖైరాతాబాద్ గణేష్ పర్విదినానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దే్శంలోనే అత్యంత ఎత్తైన వినాయకున్ని రూపొందించడం, 11రోజులు పవిత్ర పూజలందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేర్చే వరకూ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 25లక్షల మంది భక్తులు ఖైరాతా బాద్ వినాయకున్న దర్శించుకుంటారని, ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని గణేష్ ఉత్సవ సమితి ఉపాద్యక్షులు మహేష్ యాదవ్ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా తొలిరోజు పూజలు నిర్వమించేందుకు గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించబోతున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ పందకొండు రోజుల పాటు, విద్యుత్, జీహెచ్ఎంసీ, ఆర్ ఆండ్ బీ, హెఎండీఏ, రవాణా, పోలీస్, అటవీ శాఖల అదికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని మహేష్ తెలిపారు. ఖైరతాబాద్ భారీ గణణాథుడిపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

 తుది మెరుగులు దిద్దుకోబోతున్న ఖైరాతాబాద్ గణేషుడు..! నగరానికి చవితి శోభ..!!

తుది మెరుగులు దిద్దుకోబోతున్న ఖైరాతాబాద్ గణేషుడు..! నగరానికి చవితి శోభ..!!

భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా ఇరు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతీ యేడాదిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడు భిన్నమైన రూపంలో కనిపించబోతున్నాడు. 64ఏళ్లుగా, 64 రూపాల్లో దర్శనమిచ్చిన లంబోదరుడు ఈ యేడు ద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో సూర్యభగవానుడి రూపంలో కటాక్షించబోతున్నాడు. ఎందుకంటే ఈ యేడాది ఎండ ప్రభాం ఎక్కువగా ఉండటంతో, ఆదిత్యుడు శాంతించాలని ద్వాదశాదిత్య ఆ రూపాన్ని తీసుకున్నారు.

 ఈ సారి కూడా భారీ గణనాయకుడే..! కనువిందు చేయనున్న ద్వాదశాదిత్యుడు..!!

ఈ సారి కూడా భారీ గణనాయకుడే..! కనువిందు చేయనున్న ద్వాదశాదిత్యుడు..!!

గత సంవస్పరం 57 అడుగులున్న ఖైరతబాద్ వినాయకుడు ఈసారి 61 అడుగులకి పెరిగాడు. వాస్తవానికి 56 ఫీట్లకే డిజైన్ చేశారు. కానీ తలపై తల, దానిపై సర్పాలు రావడం వల్ల విగ్రహం హైట్ పెరిగింది. 12 శిరస్సులు, 24 హస్తాలు, 12 ఆదిశేషువులు, ఏడు అశ్వాలతో కొలువుదీరుతున్న వినాయకుడికి.. ఎడమవైపున దత్రాత్రేయుడు, కామధేనువు సిద్ధకుంజికాదేవీ ఉంటారు. కుడివైపు ఏకాదశిదేవి, మహావిష్ణువు రూపం దర్శనమిస్తుంది. కర్రపూజ జరిగిన వెంటనే సిద్ధాంతిని సలహా మేరకు, ఈసారి వినాయకుడిని సూర్యుడి రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు.

 150మంది కళాకురులు..! శరవేగంగా రూపుదిద్దుకుంటున్న లంబోదరుడు..!!

150మంది కళాకురులు..! శరవేగంగా రూపుదిద్దుకుంటున్న లంబోదరుడు..!!

చెన్నయ్‌ నుంచి ఆర్టిస్టులు వచ్చి క్లేవర్క్ స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు చేశారు. బీహార్, బెంగాల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు విగ్రహాలకు మెరుగులు దిద్దారు. హైదరాబాద్ వర్కర్లు మౌల్డింగ్ పనులు చేశారు. మరో రెండుమూడు రోజుల్లో డిజైన్ వర్కంతా పూర్తవుతుంది. ఇప్పటికే ఫినిష్ అయిన చోట పెయింటింగ్‌ కంప్లీట్ అయింది. ఈనెల 25 కల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని స్తపతి రాజేంద్రన్ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే కేవలం 11 రోజుల్లోనే లక్షల మందికి దర్శనం కలగడం లేదని, అందుకే ఈసారి వారం ముందునుంచే మహాగణపతి దర్శనమిస్తాడని ఆయన చెప్తున్నాడు.

 అవాంఛనీయ సంఘటనలకు తావు లేదు..! పటిష్ట భద్రత నడుమ పూజలందుకోనున్న ఏక దంతుడు..!!

అవాంఛనీయ సంఘటనలకు తావు లేదు..! పటిష్ట భద్రత నడుమ పూజలందుకోనున్న ఏక దంతుడు..!!

11 రోజులపాటు దేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయం చేసుకునేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ఉత్సవ కమిటీ ధన్యవాదాలు చెబుతోంది. బస్తీ ప్రజలు కూడా వారికి సహకరిస్తున్నారు. కమిటీ తరపున 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసు శాఖ వారు 20 కెమెరాలు పెడుతున్నారని గణేష్ ఉత్పవ కమిటీ కన్వీనర్ సందీప్ అంటున్నారు. సకల విఘ్నాలను కూలదోసే నాగయజ్ఞోపవీతుణ్ని కొలిస్తే, ఎవరైనా బృహస్పతి సమజ్ఞానులే అవుతారు. సకలగ్రహపతి అయిన చిదానంద రూపాన్ని దర్శనం చేసుకున్నంతనే, సకల అరిష్టాలు మాయమవుతాయి. ద్వాదశాదిత్య మహాగణపతి రూపంలో కొలువుదీరబోయే ఈ ప్రకాశ స్వరూపుడి నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవరోధాలు లేకుండా గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటుందని ఆశిద్దాం..!

English summary
Khairatabad Ganapathi, who gives a huge shape of darshan, has a special identity in both states, not only in Hyderabad. Like every year, Khairatabad Ganesh is going to appear in a different form. For 60 years,who appeared in 60 forms, is going to bless the devotees as the Lord of this seven-year-Dwadyasaditya Maha-Ganapati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X