హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగాల కలకలం .. వైద్య శాఖ ఏం చేస్తుందో ?

|
Google Oneindia TeluguNews

అనుమతి లేని కొలువులు చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని ఉద్యోగులు అడ్డంగా బుక్ అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మంది నకిలీ ఉద్యోగులను గుర్తించారు సూపరిండెంట్ . కనీసం ఇంజక్షన్ కూడా సరిగా చేయడం రాకపోవడంతో అనుమానించిన సూపరిండెంట్ దీనిపై ఎంక్వయిరీ చేయగా అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారు <br>ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారు

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేర ఘరానా మోసం

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేర ఘరానా మోసం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఆసుపత్రిలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిని సూపరింటెండెంట్‌ గుర్తించడంతో ఈ తతంగం వెలుగు చూసింది. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు ఆసుపత్రిలో వార్డులను పరిశీలించే సమయంలో ఒక వ్యక్తి రోగికి ఇంజక్షన్‌ కూడా ఇవ్వడం రాకుండా పని చేస్తున్న తీరుతో అనుమానం వచ్చిన సూపరింటెండెంట్‌ అతడిని ప్రశ్నించారు.

అనధికార నియామకాలు చేసిన సతీష్ అనే వ్యక్తి .. 24 మంది నియామకం

అనధికార నియామకాలు చేసిన సతీష్ అనే వ్యక్తి .. 24 మంది నియామకం

దీంతో సదరు వ్యక్తి, తనను సతీష్‌ అనే వ్యక్తి నియమించాడని, తనతో పాటు మరికొందరిని కూడా నియమించాడని చెప్పాడు. దీంతో సూపరింటెండెంట్‌ వార్డులను పరిశీలించి, ఆసుపత్రిలో పనిచేస్తున్న పది మందిని పట్టుకున్నారు. వారిని విచారించగా, సతీష్‌ అనే వ్యక్తి ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానని మొత్తం 24 మందిని అనధికారికంగా ఆసుపత్రిలో నియమించాడని తెలిసింది. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకున్నట్టు బాధితులు తెలిపారు.

నకిలీలు పని చేస్తున్నా వైద్య శాఖ ఏం చేస్తుంది ?

నకిలీలు పని చేస్తున్నా వైద్య శాఖ ఏం చేస్తుంది ?

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది అనధికారికంగా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేస్తున్న పట్టించుకోని వైద్యశాఖ తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక ప్రభుత్వ ఆస్పత్రి లో అనధికార నియామకాలు చేపట్టిన సతీష్ ఎవరు. అతని వెనుక వైద్య శాఖలో ఎవరైనా ఉండి ఈ తతంగమంతా చేయిస్తున్నారా అన్న అనుమానాలు సైతం లేకపోలేదు. సూపరింటెండెంట్‌ పరిశీలనలో భాగంగా 24 మంది నకిలీ ఉద్యోగులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికారికంగా ఉద్యోగాలు చేయిస్తున్న సతీష్ అనే వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి తెలియకుండానే ఈ వ్యవహారమంతా నడిచే అవకాశం లేదు. కాబట్టి ఈ నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇదే అదునుగా రాష్ట్రవ్యాప్తంగా నకిలీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

English summary
The fake jobs were found in the government hospital at Nizamabad district headquarters. The matter was sparked by the superintendent's identification of unauthorized duties in the hospital.The superintendent who was suspected of working un authorised , when the fake employee giving injuction to a patient in an inappropriate way . Superintendent Dr Ramulu found the fake employees with this issue and he complained .Satish's fraud has been found to bring jobs in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X