హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగ భృతికి లైన్ క్లియర్.. త్వరలోనే అమలు చేస్తామన్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు అండగా ఉంటామనే టీఆర్ఎస్ ఎన్నికల హామీ మేరకు అడుగులు ముందుకు పడుతున్నాయి. మరో నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి అమలుచేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. నిరుద్యోగ భృతి పథకం అమలుకై విధివిధానాలు అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నిరుద్యోగుల వివరాలు సేకరించే పని స్పీడప్ చేసినట్లు తెలిపారు.

unemployment benefit implementation within four five months kcr said

నిరుద్యోగ భృతి అమలు చేయడానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నామన్నారు కేసీఆర్. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 18వందల 10 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతిని పకడ్బందీగా అమలు చేస్తామని.. ఆ విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. నాలుగైదు నెలల్లో అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

English summary
The unemployed youth are in the forefront of the TRS election guarantee. Announcing the unemployment benefit will be distribute in another four and a half months, Chief Minister KCR said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X